Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు

Telangana CM Revanth Reddy Delhi tour cancelled
  • ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశాలు
  • తెలంగాణ నుంచి దామోదర రాజనర్సింహ, వంశీచంద్ రెడ్డి హాజరు
  • ఏపీ నుంచి రఘువీరా, పల్లంరాజు, కొప్పుల రాజు, సుబ్బరామిరెడ్డిలు హాజరు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. సీడబ్ల్యూసీ సమావేశాలలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గురువారం ఉదయం ముఖ్యమంత్రి... సభకు వచ్చి ఆ తర్వాత మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కానీ ఇప్పుడు ఆ పర్యటన రద్దయింది. 

సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్న దామోదర రాజనర్సింహ, ప్రత్యేక ఇన్వైటీ వంశీచంద్ రెడ్డి ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు జరగనున్న ఈ భేటీలో... ఇటీవలి వివిధ రాష్ట్రాలలోని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి రఘువీరారెడ్డి, పల్లంరాజు, కొప్పుల రాజు, సుబ్బరామిరెడ్డి పాల్గొననున్నారు.
Revanth Reddy
Congress
Telangana
cwc

More Telugu News