జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జగన్
- జగన్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలన్న మోదీ
- పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న వైసీపీ శ్రేణులు
మరోవైపు జగన్ పుట్టిన రోజును వైసీపీ శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. రక్తదాన శిబిరాలను, అన్నదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లను పంపిణీ చేస్తున్నారు. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టారు.