Vande Bharat Rail: ఇప్పుడు మరింత వేగంగా.. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ రైలు స్పీడ్ పెంపు

  • రైలు వేగాన్ని 15 నిమిషాలు పెంచిన అధికారులు
  • ఆ మేరకు తగ్గనున్న ప్రయాణ సమయం
  • ఇకపై కాచిగూడలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరనున్న రైలు
Now Kacheguda Yashwantpur Express 15 Minutes Faster Than Previous

కాచిగూడ-యశ్వంత్‌పూర్ మార్గంలో నడుస్తున్న వందేభారత్ రైలు వేగం 15 నిమిషాల మేర పెరిగింది. దీంతో రెండు స్టేషన్ల మధ్య ప్రయాణ దూరం  8.15 గంటలకు తగ్గింది. ప్రస్తుతం ఈ రైలు కాచిగూడలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది. అంటే ప్రయాణ సమయం 8.30 గంటలు. 

ఇప్పుడు రైలు వేగాన్ని 15 నిమిషాల మేర పెంచడంతో ఈ సమయంలోనూ పావుగంట కలిసి వస్తుంది. అంటే ఇకపై ఈ రైలు కాచిగూడలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరుతుంది. యశ్వంత్‌పూర్ చేరుకునే సమయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని రైల్వే అధికారులు తెలిపారు. 

తిరుగు ప్రయాణంలో గతంలో మధ్యాహ్నం 2.45 గంటలకు రైలు బయలుదేరగా ఈ సమయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గతంలో రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకోగా, ఇప్పుడు 11 గంటలకే చేరుకోనుంది. ఇది మహబూబ్‌నగర్, కర్నూలు సిటీ, అనంతపురం, ధర్మవరం మీదుగా ప్రయాణిస్తుంది.

More Telugu News