Vijayawada: కారులో గ్యాస్ లీక్.. అమెరికాలో విజయవాడ యువతి మృతి

Vijayawada woman dies in chicago after gas leak in car
  • పైచదువుల కోసం అమెరికాకు వెళ్లిన విజయవాడ యువతి
  • బుధవారం షికాగోలో కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం
  • కారులో అకస్మాత్తుగా గ్యాస్ లీక్ కావడంతో స్పృహ కోల్పోయిన యువతి
  • ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యుల ప్రకటన
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు యువతి అనూహ్య రీతిలో దుర్మరణం చెందింది. కారులో ప్రయాణిస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో కన్నుమూసింది. విజయవాడ గ్రామీణం ప్రసాదంపాడుకు చెందిన షేక్ జహీరా నాజ్ (22) స్థానికంగా ఫిజయోథెరపీలో డిగ్రీ చేసింది. ఈ ఏడాది ఆగస్టులో ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లింది. బుధవారం షికాగో నగరంలో ఆమె ప్రయాణిస్తున్న కారులో గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో, డ్రైవర్‌తో పాటూ నాజ్ కూడా స్పృహ తప్పింది. జహీరా నాజ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
Vijayawada
USA
Andhra Pradesh
NRI

More Telugu News