Khel Ratna Awards: మహ్మద్ షమీకి అర్జున అవార్డ్.. సాత్విక్-చిరాక్ జోడీకి ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం

  • 2023 ఏడాది జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
  • అర్జున అవార్డుకు 26 మంది, ద్రోణాచార్య అవార్డుకు ఐదుగురి ఎంపిక
  • జనవరి 9, 2024న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్న క్రీడాకారులు
Khel Ratna Awards for Satwik and Chirak Jodi and Arjuna Award for Mohammad Shami

ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023లో సంచలన ప్రదర్శన చేసిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీని ప్రతిష్టాత్మక అర్జున అవార్డు వరించింది. సంచలనాలు సృష్టిస్తున్న భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్నకు ఎంపికయారు. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వశాఖ 2023 ఏడాదికిగానూ జాతీయ క్రీడా అవార్డులను బుధవారం ప్రకటించింది. అర్జున అవార్డుకు 26 మంది, ద్రోణాచార్య అవార్డుకు ఐదుగురి పేర్లను కేంద్రం ప్రకటించింది. లలిత్ కుమార్‌ (రెజ్లింగ్), ఆర్‌‌బీ రమేశ్ (చెస్), మహవీర్‌ ప్రసాద్ సైని (పారా అథ్లెటిక్స్‌), శివేంద్ర సింగ్ (హకీ), గణేష్ ప్రభాకర్ (మల్లఖంబ)లకు ద్రోణాచార్య అవార్డులు దక్కాయి. లైఫ్ టైమ్ కేటగిరిలో జస్కీరత్ సింగ్ గ్రేవాల్ (గోల్ఫ్‌), భాస్కరన్ ఈ (కబడ్డీ), జయంత కుమార్ పుషీలాల్ (టేబుల్ టెన్నిస్)లకు అవార్డులు దక్కాయి. ఇక మంజుషా కన్వర్ (బ్యాడ్మింటన్), వినీత్ కుమార్‌ శర్మ (హకీ), కవిత సెల్వరాజ్‌లకు (కబడ్డీ) జీవిత సాఫల్య పురుస్కారం 2023 దక్కాయి.

అర్జున అవార్డు అందుకోనున్న ఆటగాళ్ల జాబితా..

మహ్మద్ షమి (క్రికెట్), అనూష్ అగర్వాలా (ఈక్వస్ట్రియన్‌), దివ్యకృతి సింగ్(ఈక్వస్ట్రియన్‌ డ్రస్సెజ్‌), దీక్షా దాగర్ (గోల్ఫ్‌), క్రిషన్ బహదూర్ పాఠక్ (హకీ), ఓజస్ ప్రవీణ్ (ఆర్చరీ), అదితి గోపీచంద్ స్వామి (ఆర్చరీ), శ్రీశంకర్ ఎం (అథ్లెటిక్స్‌), పారుల్ చౌదరి (అథ్లెటిక్స్), మహ్మద్‌ హుసాముద్దీన్‌ (బాక్సింగ్‌), ఆర్ వైశాలి (చెస్), సుశీల చాను (హకీ), పవన్ కుమార్ (కబడ్డీ), రితూ నేగి (కబడ్డీ), నస్రీన్ (ఖో ఖో), పింకీ (లాన్ బౌల్స్), ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్), ఇషా సింగ్ (షూటింగ్), హరీందర్ పాల్ సింగ్ సంధు (స్క్వాష్‌), అహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్), సునీల్ కుమార్ (రెజ్లింగ్), అంతిమ్ (రెజ్లింగ్), నౌరెమ్ రోషిబినా దేవి (వు షూ), శీతల్ దేవి (పారా ఆర్చరీ), అజయ్‌రెడ్డి (అంధుల క్రికెట్‌), ప్రాచీ యాదవ్ (పారా కానోయింగ్‌లను కేంద్రం ప్రకటించింది. కాగా ఈ అవార్డులను క్రీడాకారులను జనవరి 9, 2024న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందుకోనున్నారు.

More Telugu News