Nara Lokesh: లోకేశ్ పాదయాత్ర విజయవంతంలో కీలకపాత్ర వహించిన కమిటీలు ఇవే!

  • ముగిసిన నారా లోకేశ్ పాదయాత్ర
  • 226 రోజుల పాటు సాగిన నారా లోకేశ్ యువగళం
  • లోకేశ్ పాదయాత్ర కోసం 14 నిర్వహణ కమిటీలు
14 Committees coordinates Nara Lokesh Yuvagalam Padayatra

యువగళం పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో 14 నిర్వహణ కమిటీలు అనునిత్యం నారా లోకేశ్ వెన్నంటే ఉంటూ యాత్ర విజయవంతంగా కొనసాగడంలో కీలకపాత్ర వహించాయి. ఇందులో పలువురిపై కేసులు నమోదు చేసినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఈ కమిటీలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాయి. 

ముఖ్యంగా యువగళం ప్రధాన కోఆర్డినేటర్ కిలారి రాజేశ్ పై సీఐడీ కేసు నమోదు చేయడం తెలిసిందే. కేసులు ఎదుర్కొంటున్నప్పటికీ రాజేశ్ పాదయాత్ర సక్సెస్ కావడంలో తన వంతు పాత్రను పోషించారు. 226 రోజుల పాటు సాగిన యువగళానికి ఈ కమిటీలు దిక్సూచిగా నిలిచాయి.

1. యువగళం మెయిన్ కోఆర్డినేటర్ – కిలారి రాజేశ్.

2. వ్యక్తిగత సహాయక బృందం – తాతా నరేశ్, కుంచనపల్లి వినయ్, పిన్నింటి మూర్తి.

3. వాలంటీర్స్ కమిటీ – అనిమిని రవినాయుడు, మానం ప్రణవ్ గోపాల్.

4. ఫుడ్ కమిటీ – మద్దిపట్ల సూర్యప్రకాశ్, లక్ష్మీపతి.

5. మీడియా కమిటీ – మెయిన్ కో-ఆర్డినేటర్ బి.వి.వెంకటరాముడు, కాసరనేని జశ్వంత్.

6. పబ్లిక్ రిలేషన్స్ కమిటీ –కృష్ణారావు, కిశోర్, మునీంద్ర, చల్లా మధుసూదనరావు. ఫోటోగ్రాఫర్స్: సంతోష్, శ్రీనివాస్, కాశీప్రసాద్.

7. అలంకరణ కమిటీ – బ్రహ్మం చౌదరి, మలిశెట్టి వెంకటేశ్.

8. అడ్వాన్స్ టీమ్ కమిటీ – డూండీ రాకేశ్, నిమ్మగడ్డ చైతన్య, శ్రీరంగం నవీన్ కుమార్, చంద్రశేఖర్, నారాయణస్వామి.

9. రూట్ కోఆర్డినేషన్ కమిటీ – కస్తూరి కోటేశ్వరరావు (కేకే), కర్నాటి అమర్నాథ్ రెడ్డి.

10. కరపత్రాల పంపిణీ కమిటీ – అడుసుమిల్లి విజయ్, వెంకటప్ప, వంశీ, చీరాల నరేశ్.

11. సెల్ఫీ కోఆర్డినేషన్ కమిటీ – వెల్లంపల్లి సూర్య, ప్రదీప్, శ్రీధర్ చౌదరి.

12. వసతుల కమిటీ – జంగాల వెంకటేశ్, నారా ప్రశాంత్, లీలాధర్, బాబీ, రమేశ్.

13. తాగునీటి వసతి కమిటీ – భాస్కర్, సీహెచ్. వెంకట్, అనిల్.

14. సోషల్ మీడియా – అర్జున్.

====

ఆకట్టుకున్న ప్రత్యేక కార్యక్రమాలు

యువగళం సందర్భంగా ప్రతి జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభించింది. ఇప్పటివరకు మరే ఇతర జిల్లాల్లో లేని విధంగా గుంటూరు జిల్లాలో 3 చోట్ల లోకేశ్  ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొత్తం ఇప్పటివరకు నిర్వహించిన 12 ప్రత్యేక కార్యక్రమాలకు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన లభించింది. యువత, మహిళలు, బీసీ, ఎస్సీలు, రైతులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశాల్లో ఆయా వర్గాలకు టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చేయబోతున్నామో లోకేశ్ విస్పష్టంగా చెప్పారు.

More Telugu News