Nara Lokesh: రాయలసీమలో నారా లోకేశ్ యువగళం రికార్డు

  • జనవరి 27న కుప్పంలో మొదలైన యువగళం
  • రాయలసీమలో 124 రోజుల పాటు పాదయాత్ర చేసిన లోకేశ్
  • 1,587 కిలోమీటర్ల నడక
  • ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 25 కేసుల నమోదు
Nara Lokesh Yuvagalam Padayatra set record in Rayalaseema

గతంలో ఏ నాయకుడు చేయని విధంగా రాయలసీమలో సుదీర్ఘ పాదయాత్రతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రికార్డు సృష్టించారు. రాయలసీమలో 124 రోజుల పాటు, 44 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,587 కి.మీ మేర యువగళం పాదయాత్ర కొనసాగింది. అనుక్షణం ప్రజల్లో మమేకమవుతూ లోకేశ్ పాదయాత్ర సాగింది. 

రాయలసీమలో యువగళానికి లభించిన అపూర్వ స్పందన టీడీపీ వర్గాల్లో ఉత్సాహం రెట్టింపు చేసింది. రాయలసీమలో పాదయాత్రకు కొన్నిచోట్ల అవాంతరాలు ఎదురైనా లోకేశ్ ముందుకు సాగారు. 

కాగా, కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభమైంది మొదలు తంబళ్ల నియోజకవర్గం వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తంగా 25 పోలీసు కేసులు నమోదయ్యాయి. ఇందులో లోకేశ్ పైనే 3 కేసులు నమోదు చేశారు. 

కొన్నిచోట్ల ప్రచార రథం, సౌండ్ సిస్టమ్, మైక్, స్టూల్ తో సహా అన్నింటినీ పోలీసులు సీజ్ చేశారు. అయినప్పటికీ, లోకేశ్ మైక్ లేకుండానే మాట్లాడి టీడీపీ శ్రేణుల్లో పోరాట స్ఫూర్తి నింపారు.

More Telugu News