Ch Malla Reddy: జవహర్ నగర్ నా గుండెకాయవంటిది: కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మల్లారెడ్డి

  • జవహర్ నగర్ ప్రాంత ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్న మాజీ మంత్రి
  • ప్రగతి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వ్యాఖ్య
  • కల్యాణలక్ష్మి పథకంతో ప్రతి నిరుపేద ఇంట్లో ఆనందం కనిపించిందన్న మల్లారెడ్డి
Mallareddy distributed Kalyanalaxmi cheques

జవహర్ నగర్ తన గుండెకాయవంటిదని... ఈ ప్రాంత ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన జవహర్ నగర్ కార్పోరేషన్ తహసీల్దార్ మీటింగ్ హాలులో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రగతి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, బీఆర్‌ఎస్ తీసుకువచ్చిన కల్యాణలక్ష్మి పథకంతో ప్రతి నిరుపేద ఇంట్లో ఆనందం కనిపించిందన్నారు. మేడ్చల్‌ను మరింత అభివృద్ధి చేసి ఉత్తమ నియోజకవర్గంలా తీర్చిదిద్దుతానన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇరవై మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

More Telugu News