Revanth Reddy: గ్రేటర్ హైదరాబాద్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్

CM Revanth Reddy focus on greater Hyderabad
  • గ్రేటర్ పరిధిలో ఇప్పటికే సీఎం, మంత్రులు పలుమార్లు సమీక్ష
  • ఈ నెల 25వ తేదీ తర్వాత జీహెచ్ఎంసీ - హెచ్ఎండీఏపై మళ్లీ సమీక్ష
  • జీహెచ్ఎంసీ-హెచ్ఎండీఏ పరిధిలో నివేదిక తయారు చేసి సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వం ఆదేశం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్‌పై ఫోకస్ పెట్టారు. సీఎం రేవంత్, మంత్రులు గ్రేటర్ పరిధిలో పలు శాఖలపై ఇప్పటకే వివిధ సందర్భాలలో సమీక్షలు నిర్వహించారు. ఈ నెల 25వ తేదీ తర్వాత జీహెచ్ఎంసీ - హెచ్ఎండీఏపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సమీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ - హెచ్ఎండీఏ పరిధిలో నివేదిక తయారు చేసి సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్, పెండింగ్ పనుల లిస్ట్‌పై బల్దియా కసరత్తు ప్రారంభించింది. మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలో ఓఆర్ఆర్ టెండర్లు, భూముల వేలంతో పాటు పెండింగ్ పనుల లిస్ట్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉన్న విషయం తెలిసిందే.
Revanth Reddy
Telangana

More Telugu News