Revanth Reddy: తుగ్లక్ రోడ్డులోని తన అధికార నివాసాన్ని సందర్శించిన రేవంత్ రెడ్డి

CM Revanth Reddy visits his official residence in Delhi
  • ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో సీఎం అధికార నివాసం
  • ఇటీవలే ఈ నివాసాన్ని ఖాళీ చేసిన కేసీఆర్
  • తొలిసారి ఈ నివాసాన్ని సందర్శించిన రేవంత్
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అధికార నివాసాన్ని సందర్శించారు. ఈ భవనం తుగ్లక్ రోడ్ లో ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 20 ఏళ్ల పాటు ఈ అధికార నివాసంలో ఉన్నారు. సీఎం పదవిని కోల్పోయిన కేసీఆర్ అధికార నివాసాన్ని ఖాళీ చేశారు. సీఎంగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారి ఈ నివాసానికి వచ్చారు. అంతకు ముందు ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే రేవంత్ తొలుత ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో పీఏసీలో చర్చించిన అంశాల గురించి ఆయనకు వివరించారు.
Revanth Reddy
Congress
Delhi
Official Residence

More Telugu News