KTR: తెలంగాణ భవిష్యత్తు కూడా ఇదేనా?: కేటీఆర్

Is this the future template for Telangana too after successfully hoodwinking the people in elections asks KTR
  • హామీలు నెరవేర్చడానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తామన్న సిద్ధరామయ్య
  • తెలంగాణలో ప్రజలను విజయవంతంగా మభ్యపెట్టారన్న కేటీఆర్
  • భారీ ప్రకటనలు చేసేముందు కనీస అధ్యయనం చేయాల్సిన అవసరం లేదా? అని ప్రశ్న
తెలంగాణలో ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని హామీలనూ నెరవేరుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఇలాంటి హామీలతోనే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తాజాగా కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి. 'డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాం? ఎన్నికల సమయంలో మేము హామీలు ఇచ్చిన సంగతి నిజమేనప్పా. చెప్పినవన్నీ చేయడం సాధ్యమేనా?' అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... ఎన్నికల్లో ప్రజలను సక్సెస్ ఫుల్ గా మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని... తెలంగాణ భవిష్యత్తు కూడా ఇదేనా? అని ప్రశ్నించారు. భారీ ప్రకటనలు చేసే ముందు మీరు కనీస అధ్యయనం, ప్లానింగ్ చేయాల్సిన అవసరం లేదా? అని విమర్శించారు.
KTR
BRS
Siddaramaiah
Congress

More Telugu News