Revanth Reddy: ఢిల్లీలో రేవంత్‌రెడ్డి కోసం అధికారిక నివాసం రెడీ.. కేసీఆర్ నేమ్‌ప్లేట్ తొలగింపు

Delhi house ready for Telangana CM Revanth Reddy
  • ఢిల్లీ తుగ్లక్ రోడ్‌ 23లో రేవంత్‌కు ఇల్లు
  • మరమ్మతులు చేసి సిద్ధం చేసిన అధికారులు
  • ఇదే ఇంట్లో 20 ఏళ్లపాటు ఉన్న కేసీఆర్
  • అధికారం కోల్పోవడంతో ఖాళీ చేసిన వైనం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోసం దేశరాజధాని ఢిల్లీలో అధికారిక నివాసం సిద్ధమైంది. తుగ్లక్ రోడ్ 23లోని అధికారిక నివాసానికి చిన్నచిన్న మరమ్మతులు చేసి పూర్తిగా సిద్ధం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఉన్న నేమ్‌ప్లేట్‌ను తొలగించి దాని స్థానంలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రేవంత్‌రెడ్డి పేరుతో నేమ్‌ప్లేట్ ఏర్పాటు చేశారు.

రేవంత్‌కు కేటాయించిన ఈ ఇంట్లో కేసీఆర్ దాదాపు 20 సంవత్సరాలపాటు ఉన్నారు. 2004లో కేంద్రమంత్రి హోదాలో కేసీఆర్ ఈ ఇంటికి మారారు. ఆ తర్వాత ఉద్యమ నేత, సీఎంగా ఈ ఇంటిని కొనసాగించారు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఖాళీ చేయక తప్పలేదు. కేసీఆర్‌కు సంబంధించిన వస్తువులను ఆ ఇంటి నుంచి ఇటీవలే అధికారులు తరలించారు. కాగా, నేడు ఢిల్లీ వెళ్తున్న రేవంత్‌రెడ్డి ఇదే ఇంట్లో దిగుతారా? లేదా? అనే విషయంలో స్పష్టత లేదు.
Revanth Reddy
KCR
New Delhi
Telangana

More Telugu News