Vaishnav Tej: నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్ పైకి 'ఆదికేశవ'

  • నవంబర్ 24వ తేదీన వచ్చిన 'ఆదికేశవ'
  • ఈ నెల 22వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో 
  • వైష్ణవ్ తేజ్ జోడీగా శ్రీలీల సందడి చేసిన సినిమా 
  • ప్రతినాయకుడిగా జోజు జార్జ్ పరిచయం

Adi Keshava Movie Streaming Date Confirmed

వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నవంబర్ 24వ తేదీన 'ఆదికేశవ' సినిమా వచ్చింది. సితార నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి, శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహించాడు. కథానాయికగా శ్రీలీల నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడి పాత్రను జోజు జార్జ్ పోషించాడు. మలయాళంలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఆయనకి, తెలుగులో ఇదే ఫస్టు సినిమా. 
 
కుర్రజంట కావడంతో ఈ సినిమా కోసం యూత్ ఎక్కువగా ఎదురుచూసింది. అయితే లవ్ .. రొమాన్స్ కంటే యాక్షన్ ఎక్కువగా ఉండటం వలన, వాళ్లను మెప్పించలేకపోయింది. ఆశించినస్థాయి రెస్పాన్స్ ను థియేటర్స్ నుంచి తెచ్చుకోలేకపోయింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ద్వారా పలకరించడానికి రెడీ అవుతోంది.

 ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్ లో ఈ సినిమాను చూడలేకపోయినవాళ్లు, ఓటీటీలో చూసేయవచ్చు. ప్రతినాయకుడిగా జోజు జార్జ్ పాత్ర ఓకే. కానీ వైష్ణవ్ తేజ్ వైపు నుంచి యాక్షన్ పాళ్లు ఎక్కువైపోయాయి అనే టాక్ వచ్చింది. అలాంటి ఈ సినిమా ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.

More Telugu News