Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • 168 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 38 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. ఈరోజు ట్రేడింగ్ ను మార్కెట్లు లాభాలతో ప్రారంభించినప్పటికీ.. కాసేపటికే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో, సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఒడిదుడుకుల మధ్య చివరకు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 168 పాయింట్లు నష్టపోయి 71,315కి దిగజారింది. నిఫ్టీ 38 పాయింట్లు కోల్పోయి 21,418 వద్ద స్థిరపడింది. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (1.25%), రిలయన్స్ (0.99%), బజాజ్ ఫైనాన్స్ (0.92%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.74%), ఏసియన్ పెయింట్స్ (0.60%). 

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.34%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.59%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.46%), ఐటీసీ (-1.45%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.12%).

More Telugu News