Ranbir Kapoor: 17 రోజుల్లో 'యానిమల్' ఎంత వసూలు చేసిందంటే ..!

  • డిసెంబర్ 1వ తేదీన విడుదలైన 'యానిమల్'
  • నిన్నటితో 17 రోజులను పూర్తి చేసుకున్న సినిమా 
  • 835.9 కోట్ల గ్రాస్ వసూలు
  • ఇంకా కొనసాగుతున్న జోరు

Animal movie update

రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా 'యానిమల్' సినిమాను రూపొందించాడు. భూషణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా, భారీ బడ్జెట్ తో .. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 1వ తేదీన విడుదలైన ఈ సినిమా, ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.


నిన్నటితో ఈ సినిమా 17 రోజులను పూర్తి చేసుకుంది. ఈ 17 రోజుల్లో ఈ సినిమా 835.9 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ సినిమాలో హింస ఎక్కువగా ఉందనీ .. అక్కడక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయనే టాక్ పబ్లిక్ వైపు నుంచి వినిపించింది. ఆ టాక్ ను దాటుకుని మరీ ఈ సినిమా ముందుకు వెళుతుండటం విశేషం. 

తండ్రీ కొడుకుల ఎమోషన్స్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. తన తండ్రి పట్ల గల ప్రేమతో ఎంతకి తెగించడానికైనా సిద్ధపడే ఓ కొడుకు కథ ఇది. రష్మిక పాత్రకి కూడా మంచి ప్రాధాన్యత ఉంది. అనిల్ కపూర్ .. బాబీ డియోల్ వంటి బలమైన తారాగణం ఈ సినిమాకి మంచి హెల్ప్ అయింది. చూడాలి మరి ఈ సినిమా వసూళ్లు ఎక్కడి వరకూ వెళ్లి ఆగుతాయో.

More Telugu News