Nara Lokesh: నేటితో ముగియనున్న నారా లోకేశ్ పాదయాత్ర.. ఈరోజు షెడ్యూల్ ఇదే!

  • విశాఖ శివాజీనగర్ లో ముగియనున్న పాదయాత్ర
  • జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన యాత్ర
  • ఇప్పటి వరకు 3,032 కిలోమీటర్లు కొనసాగిన పాదయాత్ర
Nara Lokesh Yuvagalam padayatra ending today

టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. విశాఖలోని శివాజీనగర్ లో యాత్ర పరిసమాప్తం కానుంది. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి పాదల చెంతన ప్రారంభమైన యాత్ర 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, 2,028 గ్రామాల మీదుగా కొనసాగింది. ఇప్పటి వరకు 3,032 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. 70 బహిరంగసభల్లో లోకేశ్ ప్రసంగించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పాదయాత్రకు 79 రోజుల పాటు తాత్కాలిక విరామాన్ని ఇచ్చారు. 

ఈనాటి పాదయాత్ర షెడ్యూల్:
ఉదయం 8.45 గంటలకు - నెహ్రూ పార్క్ వద్ద ఆర్మీ ఉద్యోగులతో చర్చ
10.15 గంటలకు - వై జంక్షన్ వద్ద శ్రామికులతో భేటీ
10.50 గంటలకు - చినగంత్యడ వద్ద రైతులతో సమావేశం 
11.05 గంటలకు - ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వద్ద హమాలీ కూలీలతో చర్చ
11.30 గంటలకు - గాజువాక జంక్షన్ వద్ద యువతతో భేటీ
మధ్యాహ్నం 12.25 గంటలకు - టీఎస్ఆర్ కాలేజీ వద్ద లాయర్లతో సమావేశం
2.00 గంటలకు - వడ్లపూడి జంక్షన్ వద్ద అగ్రిగోల్డ్ బాధితులు, మీసేవ ఆపరేటర్లతో ముఖాముఖి
సాయంత్రం 5 గంటలకు - శివాజీనగర్ లో శిలాఫలకం ఆవిష్కరణ, పాదయాత్ర ముగింపు.   

More Telugu News