Sunday Tragedy: విషాదం మిగిల్చిన సెలవు.. సముద్రంలో కొట్టుకుపోయిన ఐదుగురు నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు

  • మచిలీపట్టణంలోని తాళ్లపాలెం బీచ్ వద్ద ఘటన
  • ఆదివారం కావడంతో బీచ్‌కు వెళ్లిన నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
  • నలుగురిని కాపాడిన మెరైన్ పోలీసులు
  • గల్లంతైన అఖిల్ అనే విద్యార్థి కోసం గాలింపు
Nuzividu Triple IT Students Washed Away In Machilipatnam Beach

సెలవు రోజున ఎంజాయ్ చేద్దామని సముద్రానికి వెళ్లిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తీరని వేదన మిగిలింది. సముద్రంలోకి దిగి సరదాగా స్నానం చేస్తుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్ద అల వారిని సముద్రంలోకి దూసుకెళ్లింది. మచిలీపట్టణంలోని తాళ్లపాలెం బీచ్ వద్ద జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోగా వెంటనే స్పందించిన మెరైన్ పోలీసులు నలుగురిని కాపాడారు. ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. అతడి కోసం గాలిస్తున్నాడు.

నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థి తోకల అఖిల్, తన స్నేహితులైన మరో నలుగురితో కలిసి ఈ ఉదయం మచిలీపట్టణంలోని తాళ్లపాలెం బీచ్‌కు వెళ్లారు. స్నానం కోసం వారంతా సముద్రంలోకి దిగిన తర్వాత పెద్ద రాకాసి అల ఒక్కసారిగా విరుచుకుపడి వారిని లాక్కెళ్లిపోయింది. మెరైన్ పోలీసుల అప్రమత్తతతో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన అఖిల్ కోసం గాలిస్తున్నారు.

More Telugu News