రూల్స్ పాటించని పోలీస్ సిబ్బందిపై కఠిన చర్యలు: రాచకొండ సీపీ సుధీర్ బాబు
- సివిల్ వివాదాల్లో తలదూర్చితే సహించేది లేదని హెచ్చరిక
- ఎస్‌వోపీ రూల్స్ పాటించాలని సూచన
- ప్రజల మధ్య తిరిగి సమస్యలు తెలుసుకోవాలని ఆదేశాలు
కమిషనరేట్ పరిధిలో జరిగే నేరాలను సమర్థవంతంగా అరికట్టాలని పోలీసు సిబ్బందిని సుధీర్ బాబు ఆదేశించారు. టెక్నికల్ ఆధారాలు సేకరించాలని, దర్యాప్తు, నేరస్తులను పట్టుకోవడంలో సీసీటీవీ కెమెరాల ఆధారాలను సేకరించాలని సూచించారు. సీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శనివారం తొలిసారి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌లో జరిగిన ఈ సమీక్షలో డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.