Delhi Metro: డోర్‌లో చిక్కుకున్న చీర.. మెట్రో రైలు కింద పడి మహిళ దుర్మరణం

Woman comes under metro after her saree gets stuck on trains doors dies
  • ఇందర్‌లోక్ స్టేషన్‌లో గురువారం మహిళ రైలు మారుతుండగా ఘటన
  • తలుపుల్లో చీర చిక్కుకోవడంతో రైలు కింద పడి మహిళకు తీవ్ర గాయాలు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం దుర్మరణం
ఢిల్లీలో తాజాగా దారుణం చోటుచేసుకుంది. మెట్రో తలుపుల మధ్య చీర చిక్కుకుపోవడంతో రైలు కింద పడి తీవ్ర గాయాలపాలైన మహిళ మరణించింది. డిసెంబర్ 14న ప్రమాదం జరగ్గా రెండు రోజుల తరువాత మహిళ ఆసుపత్రిలో కన్నుమూసింది. మృతురాలి బంధువు తెలిపిన వివరాల ప్రకారం, నాంగ్లోయ్ నుంచి మోహన్ నగర్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఇందర్‌లోక్ స్టేషన్‌లో బాధితురాలు రైలు మారే క్రమంలో డోర్ తలుపుల్లో ఆమె చీర చిక్కుకుపోయింది. దీంతో, రైలు కింద పడ్డ ఆమె తీవ్ర గాయాలపాలవగా వెంటనే సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బాధితురాలు శనివారం సాయంత్రం మృతి చెందింది. 

మహిళకు కొడుకు, కూతురు ఉన్నారని, భర్త ఏడేళ్ల క్రితం చనిపోయారని ఆమె బంధువు తెలిపింది. కాగా, ఘటనపై విచారణ చేపడతామని మెట్రో రైల్వే సేఫ్టీ కమిషనర్ పేర్కొన్నారు. అయితే, ఈ ఉదంతంలో ఇంకా కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.
Delhi Metro
Train Accident
New Delhi
Crime News

More Telugu News