Sitanshu Kotak: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి కోచ్ ద్రావిడ్ కు విశ్రాంతి... సితాన్షు కోటక్ కు బాధ్యతలు

Sitanshu Kotak as Team India head coach in ODI Series with South Africa
  • ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా
  • ఇటీవల ముగిసిన టీ20 సిరీస్... హెడ్ కోచ్ గా వ్యవహరించిన ద్రావిడ్
  • రేపటి నుంచి వన్డే సిరీస్... కోచ్ లు గా ఎన్సీయే సిబ్బంది నియామకం
ప్రస్తుతం టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. టీ20 సిరీస్ ముగియడంతో, ఇప్పుడందరి దృష్టి వన్డే సిరీస్ పై పడింది. టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ జరగనుంది. 

కాగా, ఈ పర్యటనలో టీ20 సిరీస్ కు ప్రధాన కోచ్ గా వ్యవహరించిన రాహుల్ ద్రావిడ్ కు వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. ద్రావిడ్ స్థానంలో సౌరాష్ట్ర మాజీ ఆటగాడు సితాన్షు కోటక్ హెడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. 

అలాగే, వన్డే సిరీస్ లో అజయ్ రాత్రా, రాజిబ్ దత్తా ఫీల్డింగ్, బౌలింగ్ కోచ్ లుగా వ్యవహరించనున్నారు. వీరందరూ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ సిబ్బంది. ఈసారి వీరికి టీమిండియా కోచింగ్ బాధ్యతలు అప్పగించారు. 

అయితే, ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే... ఇటీవల కాలంలో హెడ్ కోచ్ ద్రావిడ్ కు విశ్రాంతినిచ్చిన ప్రతిసారి క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ ను జట్టు కోచ్ గా నియమించిన బీసీసీఐ... ఈసారి కొత్తవాళ్లకు అవకాశమిచ్చింది.
Sitanshu Kotak
Rahul Dravid
Head Coach
Team India
ODI Series
South Africa

More Telugu News