Quthbullapur: కుత్బుల్లాపూర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత.. కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు స్థానికుల యత్నం

Clash Between Police And locals While Demolishing Illegal Constructions Quthbullapur
  • దేవేందర్‌నగర్, బాలయ్య బస్తీలో కూల్చివేతలు
  • స్థానికులు అడ్డుకునే ప్రయత్నం
  • చెదరగొట్టే ప్రయత్నం చేసిన పోలీసులు.. కొందరి అరెస్ట్
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అధికారులను అడ్డుకున్న స్థానికులు ఆత్మహత్యకు యత్నించారు. స్థానిక దేవేందర్‌నగర్, బాలయ్య బస్తీలో వెలసిన అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రయత్నించారు. జేసీబీలతో కూల్చివేత మొదలుపెట్టడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

కూల్చివేతలు అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. భారీగా మోహరించిన పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు..ఈ క్రమంలో స్థానికుల్లో కొందరు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.


Quthbullapur
Medchal Malkajgiri District
Demolish Drive

More Telugu News