Nara Lokesh: ఈ నెల 18న ముగియనున్న లోకేశ్ పాదయాత్ర... పైలాన్ ఆవిష్కరణకు నారా భువనేశ్వరి

  • జనవరి 27 నుంచి కొనసాగుతున్న లోకేశ్ యువగళం పాదయాత్ర
  • ప్రస్తుతం ఉత్తరాంధ్రలో యువగళం
  • మరి కొన్ని రోజుల్లో ముగియనున్న వైనం
Lokesh Yuvagalam Padayatra concludes on Dec 18

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 223వ రోజు యలమంచిలి నియోజకవర్గంలో కొనసాగింది. పంచదార్ల గ్రామం నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్రకు అడుగడుగునా మహిళలు, యువకులు, విద్యార్థినీ విద్యార్థులు ఆత్మీయ స్వాగతం పలికారు. మధ్యాహ్నం వెదురువాడలో ఎన్ఎఓబి బాధిత మత్స్యకారులు, కొప్పుల వెలమలు, సెజ్ బాధితులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. 

ఈనెల 18వ తేదీన గాజువాక నియోజకవర్గం అగనంపూడి వద్ద యువగళం పాదయాత్ర ముగియనుంది. యువగళం ముగింపునకు గుర్తుగా భారీపైలాన్ ను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ తల్లి భువనేశ్వరితోపాటు నారా, నందమూరి కుటుంబసభ్యులు హాజరు కానున్నారు.

నేవీతో మాట్లాడి మత్స్యకారులకు న్యాయం చేస్తాం

నారా లోకేశ్ అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం వెదురువాడలో నావల్ ఆల్టర్నేట్ ఆపరేటింగ్ బేస్ (ఎన్ఎఓబి) బాధిత మత్స్యకారులతో ముఖాముఖి సమావేశమయ్యారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నేవీతో మాట్లాడి రెండేళ్ల లోపే జెట్టి నిర్మాణంతో పాటు, మత్స్యకారులకు మంచి ప్యాకేజ్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. 

"టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని మత్స్యకారుల సమస్య పరిష్కారం చేస్తాం. భూమి కోల్పోయిన అందరికీ న్యాయం చేస్తాం. వేటకి వెళ్లి చనిపోయిన వారి కుటుంబాలకు 31 రోజుల్లోనే  పరిహారం అందిస్తాం. ఎన్ఎఓబి బాధితుల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం" అని వెల్లడించారు.

అధికారంలోకి వచ్చాక ఎస్ఈజెడ్ బాధితులకు న్యాయం

దురువాడలో కొప్పుల వెలమ సామాజిక వర్గీయులు, ఎస్ఇజెడ్ నిర్వాసితులతో లోకేశ్  ముఖాముఖి సమావేశమయ్యారు. లోకేశ్ మాట్లాడుతూ... "బాధితులకు గతంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అందించాం. ఈసారి ప్యాకేజ్ తో పాటు కాలనీల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎస్ఈజెడ్ బాధితులు, ప్రభుత్వం చర్చించి మెరుగైన ప్యాకేజ్ అందిస్తాం. 

అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్ఈజెడ్ కాలనీల్లో నాణ్యమైన ఇళ్లు కడతాం. గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. ఎస్ఈజెడ్ నుండి కలుషితనీరు బయటకి రాకుండా పొల్యూషన్ ట్రీట్ మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తాం. పొల్యూషన్ లేని కంపెనీలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. 

మొదటి 100 రోజుల్లో భారీ ఎత్తున ఐటీ కంపెనీలు తీసుకొచ్చి స్థానికంగా యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. ఎస్ఈజెడ్ లో ఉన్న కంపెనీల ద్వారా వచ్చే సీఎస్సార్ నిధులు ఎక్కువ శాతం నిర్వాసిత కాలనీల అభివృద్ధికి వినియోగిస్తాం.

కొప్పుల వెలమలకు జగన్ అన్యాయం

కొప్పుల వెలమలు అంటే గుర్తువచ్చేది ఆత్మగౌరవం. ఇచ్చే గుణమే తప్ప చెయ్యి చాపే అలవాటు కొప్పుల వెలమలకు ఉండదు. వ్యవసాయం మీద ఎక్కువ కొప్పుల వెలమలు ఆధారపడి ఉన్నారు. జగన్ పాలనలో వ్యవసాయాన్ని దెబ్బతీసి కొప్పుల వెలమలకు తీరని అన్యాయం చేశాడు. 

ఎస్ఈజెడ్ బాధితుల సమస్యలు తెలుసుకోవడానికి మీ ముందుకి వచ్చాను. అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు రావాలి అంటే కంపెనీలు రావాలి. భూసేకరణ వలన ఎవరూ నష్టపోకూడదు, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కల్లు గీత కార్మికులను ఆదుకుంటాం. నీరా కేఫ్ లు ఏర్పాటు చేస్తాం. పని లేని సమయంలో సాయం అందిస్తాం. లిక్కర్ షాపుల్లో వాటా ఇస్తాం. తాటి చెట్ల పెంపకం కోసం సాయం చేస్తాం. ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందిస్తాం.

పొగాకు రైతును కలిసిన లోకేశ్ 

యలమంచిలి నియోజకవర్గంలో వెంకటాపురంలో ఇటీవల తుపాను కారణంగా దెబ్బతిన్న పొగాకు పంటను లోకేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కౌలురైతు అప్పారావు మాట్లాడుతూ... రూ.20వేలు కౌలుకు తీసుకుని పొగాకు పంట వేసినట్టు వెల్లడించాడు. ఇటీవల తుపాను కారణంగా పంట నాశనమైందని, కలుపుతీసి మళ్లీ బతికించేందుకు నానాతంటాలు పడుతున్నానని వాపోయాడు. తమ వంటి కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

లోకేశ్ స్పందిస్తూ...

కౌలు రైతులే కాదు, సాధారణ రైతులకు కూడా ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి సాయం అందించడంలేదని లోకేశ్ మండిపడ్డారు. తామే పంటల బీమా చెల్లిస్తామని చెప్పి రైతులను నట్టేట ముంచింది ఈ ప్రభుత్వం అని విమర్శించారు. 

ఈ ఏడాది కేవలం 16 మంది రైతులకు మాత్రమే బీమా చెల్లించినట్లు అధికారిక వెబ్ సైట్ లో ఉందని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి నిర్వాకం కారణంగా రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులతో పాటు కౌలు రైతులందరికీ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు.
====

*యువగళం పాదయాత్ర వివరాలు*


*ఈరోజు నడిచిన దూరం 14.7 కి.మీ.*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం కి.మీ. 3088.7 కి.మీ.*

*224వరోజు (16-12-2023) యువగళం వివరాలు*

*యలమంచిలి/ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు*

ఉదయం

8.00 – తిమ్మరాజుపేట డావిన్సీ స్కూలు వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.45 – మునగపాకలో యువతతో సమావేశం.

9.15 – అరుగుపాలెంలో బిసిలతో సమావేశం.

10.00 – గంగదేవిపేట జంక్షన్ లో రైతులతో సమావేశం.

10.10 – ఒంపోలులో స్థానికులతో సమావేశం.

10.30 – నాగులపల్లిలో స్థానికులతో సమావేశం.

11.00 – జివిఎంసి 82వవార్డులో భోజన విరామం.

మధ్యాహ్నం

2.00 – జివిఎంసి 82వవార్డులో యాదవులతో ముఖాముఖి.

సాయంత్రం

4.00 – జివిఎంసి 82వవార్డు నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.10 – పాదయాత్ర అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

4.20 – అనకాపల్లి బైపాస్ లో రైతులతో సమావేశం.

5.05 – అనకాపల్లి నెహ్రూ చౌక్ లో టీచర్లతో సమావేశం.

5.15 – అనకాపల్లి వేల్పుల వీధిలో కాపులతో సమావేశం.

5.25 – అనకాపల్లి ముప్పనసిల్క్స్ వద్ద వ్యాపారులతో సమావేశం.

5.40 – అనకాపల్లి రింగురోడ్డులో బెల్లంరైతులతో సమావేశం.

5.50 – అనకాపల్లి బాలకృష్ణ బస్ స్టాప్ వద్ద పెన్షనర్లతో సమావేశం.

5.55 – అనకాపల్లి టిడిపి ఆఫీసు వద్ద పాదయాత్ర 3100 కి.మీ.లకు చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.

6.10 – అనకాపల్లి పరమేశ్వరి పార్కు వద్ద దివ్యాంగులతో సమావేశం.

6.30 – అనకాపల్లి సంతోషిమాత గుడివద్ద మీ-సేవ ఉద్యోగులతో భేటీ.

6.45 – అనకాపల్లి నూకాలమ్మ తల్లి ఆర్చి వద్ద విద్యార్థులతో సమావేశం.

6.55 – పాదయాత్ర యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

రాత్రి

7.55 – తోకాడ స్మార్ట్ సిటీ వద్ద విడిది కేంద్రంలో బస.

*****

More Telugu News