Revanth Reddy: ప్రజలు ఇబ్బంది పడకుండా... సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ వెళ్లే సమయంలో నిబంధనల్లో స్వల్ప మార్పులు

Revanth reddy asks officials about traffic rules
  • కాన్వాయ్ వెళ్లే సమయంలో నిబంధనల మినహాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి సూచనలు
  • తాను బయలుదేరడానికి ముందు నుంచే ట్రాఫిక్ నిలిపివేయవద్దని సూచన
  • ట్రాఫిక్ నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసే అవకాశం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ నిబంధనల్లో కొన్నింటిని మినహాయించారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. తాను బయలుదేరడానికి ముందు నుంచే ట్రాఫిక్ నిలిపివేతలు చేయవద్దని, దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడతారని తెలిపారు. ఈ మేరకు వారికి ఊరట కల్పించాలని సూచించారు. ఈ నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్ నిబంధనల విషయంలో కాస్త వెసులుబాటు ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కాన్వాయ్ బయలుదేరే కొద్దిసేపటి ముందు వరకు వాహనాల రాకపోకలను యథావిధిగా అనుమతించే యోచనలో అధికారులు ఉన్నారు. ఇందుకు సంబంధించి ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం పోలీసులు సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోనున్నారు. సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు అమలు చేసే అవకాశముంది.
Revanth Reddy
Congress
Telangana

More Telugu News