man: సరూర్ నగర్ అత్యాచారం కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

  • కారాగార శిక్షతో పాటు రూ.30వేల జరిమానా
  • బాధితురాలికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశం
  • 2019లో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దుర్ఘటన
  • త్వరగా శిక్షపడేలా ఆధారాలను సేకరించిన అధికారులకు సీపీ సుధీర్ బాబు అభినందన
Man gets 20 year rigorous imprisonment for raping minor

హైదరాబాద్‌లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్యాచార కేసులో నిందితుడికి రంగారెడ్డి ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం కఠిన కారాగార శిక్షను విధించింది. నిందితుడికి ఇరవై సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.30 వేల జరిమానాను విధించింది. బాధితురాలికి రూ.10 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. నిందితుడికి త్వరగా శిక్షపడేలా ఆధారాలను సేకరించిన అధికారులను... రాచకొండ సీపీ సుధీర్ బాబు అభినందించారు.

2019లో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను నిర్బంధించి అత్యాచారం చేసినందుకు నిందితుడు నాగరాజును పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. కర్మన్ ఘాట్‌కు చెందిన నాగరాజుపై ఐపీసీ సెక్షన్ 376, ఫోక్సో చట్టంలోని 3, 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

More Telugu News