ఆసుపత్రి నుంచి నందినగర్ లోని తన నివాసానికి చేరుకున్న కేసీఆర్
- బాత్రూంలో కాలు జారి పడిన మాజీ సీఎం కేసీఆర్
- యశోదా ఆసుపత్రిలో శస్త్రచికిత్స
- కోలుకున్న అనంతరం నేడు డిశ్చార్జి
- ఆసుపత్రి నుంచి నేరుగా నివాసానికి పయనం
కేసీఆర్ రాక నేపథ్యంలో, నంది నగర్ నివాసం వద్ద భారీ కోలాహలం నెలకొంది. కేసీఆర్ ఇంట్లోకి ప్రవేశించగానే, వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆయనకు పట్టుబట్టలు బహూకరించారు. డిసెంబరు 7న కేసీఆర్ యర్రవల్లిలోలని తన ఫాంహౌస్ లో కాలు జారి పడిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు హైదరాబాదు యశోదా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయన ఎడమకాలి తుంటి ఎముకకు శస్త్రచికిత్స నిర్వహించారు.