Swiggy: బిర్యానీ ఆర్డర్లల్లో నగరవాసులే టాప్.. స్విగ్గీ నివేదికలో వెల్లడి

  • హౌ ఇండియా స్విగ్గీడ్-2023 నివేదిక విడుదల 
  • దేశంలో బిర్యానీ వంటకానికే అత్యధిక ఆర్డర్లు 
  • బిర్యానీ ఆర్డర్లు అధికంగా ఉన్న నగరంగా హైదరాబాద్
  • అత్యధిక ఆర్డర్లు ఉన్న నగరాల్లో హైదరాబాద్‌కు మూడో స్థానం
How india swigged this year released Hyderabad tops in biryani orders

మహానగరాల్లోని ప్రజలకు ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డరివ్వడం అలవాటుగా మారిపోయింది. స్విగ్గీ, జొమాటోలకు డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. మరోవైపు, సంవత్సరాంతం వచ్చేసిన నేపథ్యంలో స్విగ్గీ ఈ ఏడాది అత్యధికంగా ఆర్డర్స్ వచ్చిన వంటకాల గురించి ఓ నివేదిక విడుదల చేసింది. హౌ ఇండియా స్విగ్గీడ్-2023 పేరిట విడుదలైన ఈ నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 

బిర్యానీపై హైదరాబాద్ నగరవాసుల అభిమానం మరోసారి తేటతెల్లమైంది. దేశంలోని నగరాల్లోకెల్లా హైదరాబాద్‌లో అత్యధికంగా బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్టు స్విగ్గీ తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా, ఈ ఏడాది అత్యధికంగా స్విగ్గీలో అమ్ముడైన వంటకమూ బిర్యానీనే! వరసగా ఎనిమిదో ఏడాది బెస్ట్ ఆర్డర్డ్ డిష్‌గా బిర్యానీ నిలిచింది. సెకెనుకు 2.5 బిర్యానీలు అమ్ముడుపోయాయని నివేదికలో తేలింది. జవవరిలో ఏకంగా 4.30 లక్షల బిర్యానీలకు ఆర్డర్లు అందాయి. జనవరి 1 నుంచి నవంబర్ 23 వరకూ మొత్తం 2.49 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. అయితే, హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ ఏడాది ఏకంగా 1,633 బిర్యానీలు ఆర్డర్లు చేయడం నివేదికలోని మరో విశేషం. దీంతోపాటూ హైదరాబాద్ వాసులు మొత్తం రూ.6 లక్షల విలువైన ఇడ్లీలు ఆర్డర్ చేశారు. అత్యధికంగా ఆర్డర్లు నమోదైన నగరాల్లో ఢిల్లీ, చెన్నై తరువాతి స్థానంలో హైదరాబాద్ నిలిచింది.

More Telugu News