Ram Gopal Varma: జనసేనలో చంద్రబాబు కోవర్టు ఈయనే: ఆర్జీవీ

Pawan Kalyan is Chandrababu covert in Janasena says Ram Gopal Varma
  • ఈ నెల 29న విడుదలవుతున్న 'వ్యూహం'
  • తనదైన శైలిలో ప్రమోషన్లు చేస్తున్న ఆర్జీవీ
  • జనసేనలో చంద్రబాబు కోవర్ట్ పవన్ కల్యాణ్ అని వ్యాఖ్య
రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం 'వ్యూహం' ఈ నెల 29న థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లలో ప్రస్తుతం వర్మ బిజీగా ఉన్నారు. ఎక్స్ వేదికగా తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటి మాదిరే వర్మ మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేశారు. జనసేనలో చంద్రబాబు కోవర్ట్ పవన్ కల్యాణే అని అనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. 

మరోవైపు వ్యూహం చిత్రానికి సంబంధించి ఆర్జీవీ ఒక పోస్టర్ ను షేర్ చేశారు. ఇందులో పసుపురంగులో ఉన్న ఒక సైకిల్ ను ఉంచారు. టీ గ్లాసు (జనసేన గుర్తు)ను తాను పట్టుకున్న ఫొటోను పెట్టారు. వెనుక ఒక చింపాంజీ ఉంది. నా వెనకున్న జంతువుకు ఛీర్స్ అని క్యాప్షన్ పెట్టారు. 

మరోవైపు, సెన్సార్ సర్టిఫికెట్ తో ఉన్న పోస్టర్ ను ఆయన విడుదల చేశారు. చరిత్రలో తొలిసారి ఒక సెన్సార్ సర్టిఫికెట్ తో ఉన్న పోస్టర్ ఇదే అని కామెంట్ చేశారు. 
Ram Gopal Varma
Pawan Kalyan
Janasena
Chandrababu
Telugudesam
Vyuham Movie

More Telugu News