Suryakumar Yadav: అసాధారణ రికార్డులతో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav becomes only player in history to achieve 4 centuries in t20
  • టీ20 ఫార్మాట్‌లో 4 సెంచరీలు సాధించిన మూడవ ఆటగాడిగా నిలిచిన సూర్య
  • మూడవ టీ20లో సెంచరీతో రోహిత్ శర్మ, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ సరసన నిలిచిన ‘మిస్టర్ 360’
  • నాలుగు వేర్వేరు దేశాల్లో సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచిన సూర్య
దక్షిణాఫ్రికాపై 3వ టీ20 మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అసాధారణ రికార్డులు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో నాలుగు సెంచరీలు సాధించిన మూడవ బ్యాట్స్‌మెన్‌గా ‘మిస్టర్ 360’ నిలిచాడు. ఈ జాబితాలో చెరో 4 సెంచరీలతో ఉన్న రోహిత్ శర్మ, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ సరసన నిలిచాడు. అయితే సూర్య కేవలం 57 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డును సాధించగా రోహిత్ 79 మ్యాచ్‌లు,  మ్యాక్స్‌వెల్ 92  ఇన్నింగ్స్ ఆడడం గమనార్హం. దీనినిబట్టి సూర్య ఎంత వేగంగా 4 సెంచరీలను అందుకున్నాడో అర్థమవుతోంది. ఇక టీ20 ఫార్మాట్‌లో వీళ్లు ముగ్గురు మాత్రమే 4 చొప్పున సెంచరీలు నమోదు చేయగా సబావూన్ డేవిజి 3 (చెక్ రిపబ్లిక్- 31 మ్యాచ్‌లు), కోలిన్ మన్రో 3 (న్యూజిలాండ్- 62 ఇన్నింగ్స్‌), బాబర్ ఆజం 3 (పాకిస్థాన్- 98 ఇన్నింగ్స్‌) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. 

దక్షిణాఫ్రికాపై సూపర్ సెంచరీ సాధించిన సూర్య ఖాతాలో మరో రెండు రికార్డులు పడ్డాయి. టీ20లలో అత్యధిక స్కోరు సాధించిన మూడవ భారత కెప్టెన్‌గా సూర్య నిలిచాడు. ఇక సూర్య సాధించిన నాలుగు సెంచరీలు వేర్వేరు దేశాల్లో నమోదు చేయడం మరో రికార్డుగా ఉంది.  ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఇండియా, తాజాగా దక్షిణాఫ్రికాలో సెంచరీలు బాదాడు. ఈ ఫీట్ సాధించిన ఏకైక ఆటగాడిగా ‘మిస్టర్ 360’ నిలిచాడు. మాక్స్‌వెల్ సెంచరీల్లో రెండు భారత్‌లో, శ్రీలంక, ఆస్ట్రేలియాల్లో ఒక్కోటి చొప్పున బాదాడు. ఇక రోహిత్ ఇండియాలో 3, ఇంగ్లండ్‌లో 1 సెంచరీ కొట్టాడు.

కాగా దక్షిణాఫ్రికాపై 3వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు. 56 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. సూర్య ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. మొదటి అర్ధసెంచరీ సాధించడానికి 32 బంతులు ఆడిన సూర్య ఆ తర్వాత 23 బంతుల్లోనే రెండవ అర్ధసెంచరీని నమోదు చేయడం గమనార్హం.
Suryakumar Yadav
India vs South Africa
Team India
Cricket

More Telugu News