Ponguleti Srinivas Reddy: సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలి: అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచన

  • ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలను చైతన్యవంతులను చేయాలని పొంగులేటి సూచన
  • సంప్రదాయ ప్రచార మాధ్యమాలతో పాటు సోషల్ మీడియా విభాగాన్ని వినియోగించుకోవాలన్న మంత్రి
  • అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సమాచార శాఖది కీలక పాత్ర అన్న మంత్రి
Minister Ponguleti orders to officers

ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలను చైతన్యవంతులను చేయడంలో సంప్రదాయ ప్రచార మాధ్యమాలతోపాటు సోషల్ మీడియా విభాగాన్ని కూడా విస్తృతస్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ మాసపత్రికను మరింత ప్రామాణికంగా తీర్చిదిద్దడంతో పాటు దీనిని రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, ప్రజాప్రతినిధులకు, సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

సమాచార శాఖలో వివిధ విభాగాల పనితీరుపై సంబంధిత అధికారులతో... మంత్రి గురువారం సమీక్షించారు. ప్రింట్ మీడియా, అవుట్ డోర్ విభాగం చేపట్టిన కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో సమాచార శాఖ కీలక పాత్ర వహించాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, క్షేత్ర స్థాయిలో ప్రచార నిర్వహణపై దృష్టి పెట్టాలని, సమాచార శాఖ పనితీరును మెరుగు పర్చాలని అధికారులను ఆదేశించారు. సమాచార శాఖ తోపాటు మీడియా అకాడమీ చేపట్టిన కార్యక్రమాలపై సమాచార కమిషనర్ అశోక్ రెడ్డి... మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

More Telugu News