David Warner: ​ఆస్ట్రేలియా-పాకిస్థాన్ తొలి టెస్టు: వార్నర్ భారీ సెంచరీ... ఈ సిక్స్ మరీ హైలైట్

  • పెర్త్ లో తొలి టెస్టు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
  • తొలి రోజు ఆట చివరికి ఆసీస్ స్కోరు 5 వికెట్లకు 346 పరుగులు
  • 164 పరుగులు చేసిన వార్నర్
David Warner hits huge century against Pakistan

ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య పెర్త్ లో నేడు తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 346 పరుగులు చేసింది. తొలి రోజు ఆటలో ఆతిథ్య ఆసీస్ దే పైచేయిగా నిలిచింది. 

ముఖ్యంగా, ఓపెనర్ డేవిడ్ వార్నర్ భారీ సెంచరీ సాధించడం హైలైట్ గా చెప్పాలి. వార్నర్ 211 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లతో 164 పరుగులు చేశాడు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 41, మార్నస్ లబుషేన్ 16, స్టీవ్ స్మిత్ 31, ట్రావిస్ హెడ్ 40 పరుగులు చేశారు. క్రీజులో మిచెల్ మార్ష్ (15 బ్యాటింగ్), అలెక్స్ కేరీ (14 బ్యాటింగ్) ఉన్నారు. 

పాకిస్థాన్ బౌలర్లలో ఆమిర్ జమాల్ 2, షహీన్ అఫ్రిది 1, ఖుర్రమ్ షెహజాద్ 1, ఫహీమ్ అష్రాఫ్ 1 వికెట్ తీశారు. ఇక ఇవాళ్టి ఆటలో షహీన్ అఫ్రిది బౌలింగ్ లో వార్నర్ కొట్టిన స్కూప్ సిక్స్ అందరినీ అలరించింది. అఫ్రిది ఎంతో వేగంగా విసిరిన బంతిని వార్నర్ డీప్ ఫైన్ లెగ్ వైపు స్టాండ్స్ లోకి తరలించిన తీరు అద్భుతం. ఈ షాట్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

More Telugu News