RIMS Adilabad: రిమ్స్ మెడికల్ క్యాంపస్‌లో ఆగంతుకుల కలకలం

Unidentified persons create ruckus in rimps campus adilabad
  • అర్ధరాత్రి కారుతో క్యాంపస్ గేటును ఢీకొట్టిన ఆగంతుకులు
  • క్యాంపస్‌లోకి చొరబడి విద్యార్థులతో ఘర్షణ
  • కారుతో కొందరు విద్యార్థులను ఢీకొట్టిన వైనం
  • పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ క్యాంపస్‌లో నిన్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కలకలం రేపారు. అర్ధరాత్రి క్యాంపస్ గేటును కారుతో ఢీకొట్టారు. ఆ తరువాత క్యాంపస్‌లోకి చొచ్చుకెళ్లి తమకు అడ్డువచ్చిన విద్యార్థులతో గొడవపడ్డారు. కొందరు విద్యార్థులను తమ కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలు కాగా నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీ, ఇతర ఆధారాలు సేకరిస్తున్నారు.
RIMS Adilabad
Telangana
Crime News

More Telugu News