Rajiv Gandhi International Airport: శంషాబాద్ విమానాశ్రయానికి 5 కొత్త రూట్లలో ఆర్టీసీ బస్సులు!

  • తాజాగా ప్రకటించిన టీఎస్‌ఆర్‌టీసీ, రేపటి నుంచి అందుబాటులోకి
  • కేపీహెచ్‌బీ, ఈసీఐఎల్ క్రాస్‌ రోడ్స్, కొండాపూర్, సికింద్రాబాద్, సుచిత్ర నుంచి సర్వీసులు
  • మహిళలకు ఉచిత ప్రయాణం
TSRTC launches new non ac bus services to shamshabad airport in hyderabada

శంషాబాద్ ‌విమానాశ్రయానికి మరో ఐదు కొత్త రూట్లలో నాన్ ఏసీ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 15 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఈ సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. 

కొత్త రూట్లు ఇవే

  • రూటు నెంబర్ 295ఏ: కేపీహెచ్‌బీ మెయిన్ రోడ్డు-రాజీవ్‌గాంధీ విమానాశ్రయం మధ్య 4 ఆర్డినరీ బస్సులు. 
  • 229/95ఏ: సుచిత్ర - విమానాశ్రయం మధ్య 5 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు
  • 3కే/95ఏ : ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ - విమానాశ్రయం మధ్య 4 మెట్రో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు
  • 303: కొండాపూర్ - విమానాశ్రయం మధ్య 4 సిటీ ఆర్డినరీ సర్వీసులు
  • 90ఎల్/251ఏ : సికింద్రాబాద్ - విమానాశ్రయం మధ్య 4 మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులు

More Telugu News