Yuva Galam Padayatra: యలమంచిలి నియోజకవర్గంలో నారా లోకేశ్ ‘యువగళానికి’ బ్రహ్మరథం

  • యువనేతకు టీడీపీ- జనసేన కార్యకర్తల అపూర్వ స్వాగతం
  • అడుగడుగునా నీరాజనాలు, కేరింతల నడుమ యువగళం
  • పాదయాత్ర సందర్భంగా ప్రజల సమస్యలను విన్న లోకేశ్
  • టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తానని హామీ
Yuvagalam padayatra in Yalamanchili constituency

యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు యలమంచిలి నియోజకవర్గంలో జనం బ్రహ్మరథం పట్టారు. 221వరోజు యువగళం పాదయాత్ర నక్కపల్లి శివార్లనుంచి బుధవారం ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం భోజన విరామానంతరం పులకుర్తి వద్ద పాదయాత్ర యలమంచిలి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా లోకేశ్‌కు కనీవినీ ఎరుగని రీతిలో ఘనస్వాగతం లభించింది. యలమంచిలి ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, జనసేన ఇన్‌చార్జి సుందరపు విజయ్ నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు యువనేత లోకేశ్‌కు అపూర్వస్వాగతం పలికారు. భారీ గజమాలలు, డప్పుశబ్దాలు, కోలాటం, బాణసంచా మోతలతో పులకుర్తి గ్రామం దద్దరిల్లింది. 

యువనేతకు మహిళలు, యువకులు నీరాజనాలు పట్టగా, టీడీపీ-జనసేన కార్యకర్తలు కేరింతలు కొట్టారు. లోకేశ్ రాకతో యలమంచిలి నియోజకవర్గ శివార్ల వద్ద జాతీయరహదారి కిక్కిరిసిపోయింది. యువనేతను చూసేందుకు జనం రోడ్లవెంట బారులు తీరారు. యలమంచిలి శివారు ప్రాంతం జాతరను తలపించింది. 

ఉదయం నక్కపల్లి కృష్ణగోకులం లేఅవుట్ నుంచి ప్రారంభమైన యువగళం... సరిపల్లిపాలెం, కోనవానిపాలెం, తిమ్మాపురం అడ్డరోడ్డు, గోకులపాడు, పెనుగల్లు, యలమంచిలి నియోజకవర్గం పులకుర్తి, లక్కవరం, ములకలపల్లి, పురుషోత్తమపట్నం, పోతిరెడ్డిపాలెం, రేగుపాలెం మీదుగా కొత్తూరు ఎస్వీ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంది. దారిపొడవునా రైతులు, న్యాయవాదులు, యువకులు, వివిధ వర్గాల ప్రజలు యువనేతకు తమ సమస్యలను విన్నవించారు. 

ఈ సందర్భంగా నారా లోకేశ్ పలుచోట్ల స్థానికులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక స్థానికుల సమస్యలను పరిష్కారిస్తామని భరోసా ఇచ్చారు. వైసీపీ పాలన తీరును ఎండగట్టారు. పాయకరావుపేట నియోజకవర్గం పెనుగొల్లులో బీసీ సామాజికవర్గ ప్రతినిధులతో యువనేత లోకేశ్ ముఖాముఖీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... ‘‘స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించింది టీడీపీ. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది ఒక్క టీడీపీ మాత్రమే. ఆదరణ పథకం అమలు చేసింది చంద్రబాబు. కీలకమైన పదవులు బీసీలకి ఇచ్చింది టీడీపీ. టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీ సర్టిఫికేట్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. టీడీపీ హయాంలో కట్టిన కమ్యూనిటీ భవనాలు పూర్తి చెయ్యలేని చెత్త ప్రభుత్వం జగన్‌ది. చేనేత కార్మికులకు టీడీపీ పాలనలో యార్న్, కలర్, పట్టు, మగ్గాలు సబ్సిడీలో అందించాం. జగన్ చేనేత కార్మికులకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక చేనేత పరిశ్రమను ఆదుకుంటాం’’ అని అన్నారు. 
బీసీలను మోసగించిన జగన్
‘నా బీసీ, నా ఎస్సీ అంటూ జగన్ మాయ మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక మోసగించాడు.  బీసీ కార్పొరేషన్లు జగన్ నిర్వీర్యం చేసాడు. బీసీ రిజర్వేషన్లు 10 శాతం తగ్గించిన దుర్మార్గుడు జగన్. బీసీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించింది జగన్. బీసీ మంత్రి కి 100 సార్లు సవాల్ చేశా ఎవరి హయాంలో బీసీలకు న్యాయం జరిగిందో చర్చకు సిద్ధమా అని... అటు నుండి సౌండ్ లేదు. బీసీ మంత్రి పేషీలో జీతాలు ఇచ్చే దిక్కు లేదు’ అని లోకేశ్ మండిపడ్డారు. 

జగన్ పాలనలో బీసీల ఊచకోత
‘జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బీసీలను ఊచకోత కోయిస్తున్నారు. బీసీ బిడ్డ అమర్నాథ్ గౌ‌డ్‌ని దారుణంగా వైసీపీ నాయకులు చంపేశారు. అమర్నాథ్ గౌడ్ అక్కను మా అమ్మ చదివిస్తున్నారు. బీసీ నేత నందం సుబ్బయ్యని వైసీపీ నేతలు ఘోరంగా హత్య చేశారు. 64 మంది బీసీలను వైసీపీ నాయకులు చంపేశారు. 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. దామాషా పద్ధతిన బీసీలకు నిధులిస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం. జగన్ అమ్మ ఒడి, పెన్షన్ లాంటి పథకాలకు అయ్యే ఖర్చు బీసీల పేరు మీద రాస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్ తగ్గించిన 10 శాతం రిజర్వేషన్లు పెంచుతాం. మత్స్యకారులకు బోట్లు, వలలు, డీజిల్, టూ వీలర్, ఐస్ బాక్సులు అన్నీ సబ్సిడీలో అందించింది టీడీపీ ప్రభుత్వం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే  గొర్రెల కొనుగోలు కోసం సబ్సిడీ రుణాలు అందిస్తాం. మేత, మందులు కూడా సబ్సిడీలో అందిస్తాం. పెంపకం కోసం బంజరు భూములు కేటాయిస్తాం. చంద్రన్న బీమా రూ.10లక్షలకు పెంచుతాం’’ అని హామీ ఇచ్చారు. 

‘టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రన్న బీమా 5 లక్షలతో ప్రారంభించి 10 లక్షలకు పెంచుతాం. కల్లుగీత కార్మికులను ఆదుకుంది టీడీపీ. జగన్ కల్లుగీత కార్మికుల పొట్టకొట్టాడు. జే బ్రాండ్లు అమ్ముకోవడానికి కల్లుగీత కార్మికులను వేధిస్తున్నాడు జగన్. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చెట్ల పెంపకం కోసం సాయం చేస్తాం. చెట్లపై నుండి పడిపోయి చనిపోయిన వారి కుటుంబాలకు జగన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ కుటుంబాలను ఆదుకుంటాం. లిక్కర్ షాపుల్లో కల్లుగీత కార్మికులకు వాటా ఇస్తాం. కల్లుగీత కార్మికులకు పని లేని సమయంలో సాయం అందిస్తాం. నీరా కేఫ్ లు ఏర్పాటు చేస్తాం’ అని లోకేశ్ హామీ ఇచ్చారు’

మత్స్యకారుల సమస్య పరిష్కరిస్తా: లోకేశ్
‘బంగారమ్మపాలెం ఎన్ఎఓబి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాను. ప్రభుత్వం వచ్చిన వెంటనే నేవి వారితో సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాను. మత్స్యకారులను జగన్ చావుదెబ్బ కొట్టాడు. మత్స్యకారులు చేతిలో ఉన్న చెరువులు జీఓ 217 తీసుకొచ్చి వైకాపా నేతలు కొట్టేశారు. మత్స్యకారులను రోడ్డు పైకి నెట్టేశారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే జీఓ 217 రద్దు చేసి చెరువులు మత్స్యకారులకు అందిస్తాం. వలలు, బోట్లు, ఐస్ బాక్సులు, వ్యాన్లు, టూ వీలర్లు, డీజిల్ అన్ని సబ్సిడీ లో అందిస్తాం. సబ్సిడీ కూడా పెంచుతాం’
 
పౌల్ట్రీ రంగానికి సబ్సిడీలు ఇస్తాం
‘జగన్ విధ్వంసక పాలనలో పౌల్ట్రీ రంగం సంక్షోభంలో పడింది. టీడీపీ హయాంలో పౌల్ట్రీ రంగానికి అనేక సబ్సిడీలు అందించాం. మన ప్రభుత్వం వచ్చాక పౌల్ట్రీ, కాయిర్ రంగాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. పౌల్ట్రీ రంగానికి పాత విధానంలో తక్కువ ధరకి విద్యుత్ అందిస్తాం. సబ్సిడీలు అందిస్తాం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీలపై పెట్టిన అక్రమ కేసులు అన్ని ఎత్తేస్తాం. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెచ్చి, కోర్టు ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించేలా చేస్తాం’’ అని లోకేశ్ తెలిపారు. 

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... ‘బీసీ అయిన నన్ను 25 ఏళ్లకే ఎమ్మెల్యే చేసింది అన్న ఎన్టీఆర్. బీసీలకి రాజ్యాధికారం ఇచ్చింది టీడీపీ. సేవకులను ప్రజా ప్రతినిధులుగా మార్చింది టీడీపీ. బీసీలకు ఆదరణ పథకం పెట్టింది చంద్రబాబు. బీసీలను నట్టేట ముంచింది జగన్. ఆదరణ పథకం రద్దు చేసింది జగన్’ అని మండిపడ్డారు. 

వంగలపూడి అనిత మాట్లాడుతూ..‘బీసీలకు గుర్తింపు వచ్చింది టీడీపీ వలనే. పాయకరావుపేటలో బీసీలు టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్నారు. నియోజకవర్గంలో మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జగన్ పాలనలో బీసీలు అణచివేతకు గురయ్యారు’ అని పేర్కొన్నారు. 

బీసీ సామాజికవర్గ ప్రతినిధులు మాట్లాడుతూ...‘బీసీలకు తను వెన్నెముక లాంటి వాడినన్న జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీల వెన్నెముక విరగ్గొట్టాడు. గొర్రెల కొనుగోలు కోసం జగన్ ప్రభుత్వం ఎటువంటి సాయం అందించడం లేదు. టీడీపీ హయాంలో మాకు గొర్రెల కొనుగోలు కోసం సబ్సిడీ రుణాలు ఇచ్చేవారు. గొర్రెల పెంపకం కోసం బంజరు భూములు కేటాయించాలి. చంద్రన్న బీమాను జగన్ ప్రభుత్వం ఎత్తేసింది. చేతి వృత్తులు చేసుకునే మేము ప్రమాదాలకు గురైతే కుటుంబం అనాథగా మిగిలిపోతుంది. జగన్ ప్రభుత్వం కల్లుగీత కార్మికులను పట్టించుకోవడం లేదు. చెట్లపై నుండి పడిపోయి ఎవరైనా చనిపోతే కుటుంబానికి ఎటువంటి సాయం అందించడం లేదు. మత్స్యకారులకు జగన్ అనేక హామీలు ఇచ్చి మోసం చేసాడు’ అని ఆరోపించారు.  
భూముల సమస్య పరిష్కరిస్తానని మోసగించాడు
‘బంగారమ్మపాలెంలో నేవి భూముల సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి జగన్ మోసం చేశాడు. పోలీసుల పహారాలో వేటకి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. చేనేత కార్మికులను జగన్ ప్రభుత్వం నట్టేట ముంచేసింది. ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందడం లేదు. సొసైటీని నిర్వీర్యం చేసారు. సగర కులస్తులకు సర్టిఫికేట్లు ఇవ్వడానికి కూడా జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది.  బీసీ కమ్యూనిటీ హాల్స్ జగన్ ప్రభుత్వం నిర్మించడం లేదు. మీ ప్రభుత్వం వస్తే భవనాలు నిర్మించాలి. పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షంభంలో ఉంది. విద్యుత్ ఛార్జీలు, మేత రేటు విపరీతంగా పెరిగిపోయింది. టీడీపీ పాలనలో క్యాటగిరి 5లో ఉండేది. అది ఎత్తేసి జగన్ మమ్మలని వేదిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో బీసీలపై పెట్టిన అక్రమ కేసులు అన్ని మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎత్తేయాలి’’ అని విజ్ఞప్తి చేశారు.

నారా లోకేశ్‌ను కలిసిన మత్స్యకారులు
పాయకరావుపేట నియోజకవర్గం సరిపల్లిపాలెం వద్ద మత్స్యకారులు యువనేత లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘మా నియోజకవర్గం మత్స్యకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సముద్రంలో వేటకు వెళ్లి చనిపోతే డెత్ సర్టిఫికెట్ ఇవ్వడంలో అధికారులు ఇబ్బందిపెడుతున్నారు. తుఫాను సమయంలో నష్టపోయిన బోట్లు, వలలకు పరిహారం అందడం లేదు. వేట నిషేధ కాలంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.20వేలకు పెంచాలి. హెటిరో కంపెనీ వ్యర్థ జలాల వల్ల సముద్రంలో మత్స్య సంపద నశించిపోతోంది. వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు ప్రభుత్వ ఇళ్లు మంజూరు కావడం లేదు’’ అని పేర్కొన్నారు. 

దీనిపై నారా లోకేశ్ స్పందిస్తూ...‘మత్స్యకారులను అన్నివిధాలా ఆదుకున్ననది తెలుగుదేశం ప్రభుత్వమే. టీడీపీ పాలనలో మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.788.38కోట్లు ఖర్చు చేశాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు తీరని అన్యాయం చేసింది. వేట నిషేధ కాలంలో ఇచ్చే పరిహారం కూడా పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదు. మత్స్యకారులకు పనిముట్లు, బోట్లను సబ్సిడీపై టీడీపీ ఇస్తే, వైసీపీ రద్దు చేసింది. సముద్రంలో ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు రూ.5లక్షలు ఇచ్చి ఆదుకున్నాం. వైసీపీ పాలనలో కనీసం చనిపోయిన కుటుంబాలను పరామర్శించే దిక్కు లేదు. చంద్రన్న బీమా ద్వారా మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటాం. వేటకు వెళ్లి చనిపోయిన వారికి డెత్ సర్టిఫికెట్లను సకాలంలో అందించే చర్యలు తీసుకుంటాం. తుఫాను సమయంలో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకుంటాం’ అని అన్నారు. 

లోకేశ్‌ను కలిసిన కోనవానిపాలెం కొబ్బరిపీచు కార్మికులు
పాయకరావుపేట నియోజకవర్గం కోనవారిపాలెం కొబ్బరిపీచు కార్మికులు యువనేత లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘అనకాపల్లి జిల్లాలో గత 20 ఏళ్లుగా 5వేల మంది కొబ్బరిపీచు కార్మికులు పనిచేస్తున్నారు. మేము కొరుప్రోలు గ్రామంలో పరిసర ప్రాంతాల్లో 50 కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తున్నాము. మా ప్రాంతం ప్రజలు కొబ్బరిపీచు పరిశ్రమపై ఆధారపడి వేలాదిమంది జీవిస్తున్నారు. 4ఏళ్ల క్రితం మా పరిశ్రమ లాభాల్లో ముందుకు సాగింది. టీడీపీ పాలనలో మా పరిశ్రమకు ఉత్పత్తి ఖర్చులు చాలా తక్కువ అయ్యేవి. కరెంటు ఛార్జీలు, ఎగుమతి ఛార్జీలు, డీజిల్ ధరలు తక్కువగా ఉండేవి. గత నాలుగు సంవత్సరాలుగా మా పరిశ్రమలు కరెంటు ఛార్జీల పెంపు, కరెంటు కోతల నేపథ్యంలో దివాలా తీసే స్థితికి వచ్చాయి. మీరు అధికారంలోకి వచ్చాక మా పరిశ్రమకు యూనిట్ విద్యుత్ ను రూ.9 నుండి రూ.2కి తగ్గించాలి. 100 హార్స్ పవర్ దాటితే హార్స్ పవర్ కు రూ.120 చొప్పున వసూలు చేస్తోంది. ఈ ఛార్జీలు భారంగా ఉన్నాయి. కొబ్బరిపీచు ఉత్పత్తులను చైనాకు ఎగుమతి చేసుకునేందుకు డీఐసీ(డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్) అనుమతులు ఇప్పించాలి. ఎగుమతి చేసే కంటెయినర్ ఛార్జీలు కేజీకి గతంలో రూ.2 ఉండేది..నేడు రూ.4.30 వసూలు చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం కేవలం రూ.1.30మాత్రమే వసూలు చేస్తోంది. ఛార్జీలు తగ్గించి మాకు అండగా నిలవాలి’ అని విజ్ఞప్తి చేశారు.

నారా లోకేశ్ స్పందిస్తూ..‘జగన్మోహన్ రెడ్డి పరిపాలన పారిశ్రామికవేత్తలు, కార్మికులకు గొడ్డలివేటుగా పరిణమించింది. టీడీపీ పాలనలో కొత్త పరిశ్రమలు వస్తే...జగన్ పాలనలో ఉన్న పరిశ్రమలను పక్కనున్న రాష్ట్రాలకు తరిమేస్తున్నారు. కొబ్బరిపీచు పరిశ్రమను కుటీరపరిశ్రమగా గుర్తించి కరెంటు ఛార్జీలు, మినిమం ఛార్జీలు తగ్గించేందుకు చర్యలు చేపడతాం. కంటెయినర్ ఛార్జీల విషయంలో పోర్టు యాజమాన్యాలతో మాట్లాడి తగ్గింపునకు చర్యలు తీసుకుంటాం’ అని భరోసా ఇచ్చారు. 

యువనేత లోకేశ్‌ను కలిసిన నేవల్ బేస్ బాధితులు
పాయకరావుపేట నియోజకవర్గం, ఎస్ రాయవరం మండలం బంగారమ్మపాలెం, కాపుల వాతాడ గ్రామ ప్రజలు తిమ్మాపురం అడ్డరోడ్డువద్ద యువనేత లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నారా లోకేశ్ స్పందిస్తూ...‘‘దేశరక్షణ అవసరాలకు భూములిచ్చిన రైతులు, మత్స్యకారులను ఇబ్బందుల పాల్జేయడం భావ్యం కాదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నేవీ అధికారులతో మాట్లాడి మత్స్యకార వృత్తికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటాం. ఫిషింగ్ హార్బర్ నిర్మించి మత్స్యకారులకు ఉపాధి కల్పించే ఏర్పాటు చేస్తాం. చట్టాలకు లోబడి పిఎఎఫ్, పిడిఎఫ్ గ్రామాలకు పరిహారం అందిస్తాం. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. మత్స్యకార సొసైటీ భూములకు తగిన విధంగా పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటాం’’ అని హామీ ఇచ్చారు.

నారా లోకేశ్‌ను కలిసిన షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు 
పాయకరావుపేట నియోజకవర్గం ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ రైతులు, కార్మికులు యువనేత లోకేశ్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ క్రమంలో నారా లోకేశ్ స్పందిస్తూ...మాటతప్పుడు, మడమ తిప్పుడుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి అయ్యాక షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరిపిస్తామని పాదయాత్రలో చెప్పిన జగన్ నేటికి ఒక్క ఫ్యాక్టరీని కూడా తెరిపించలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కొప్పాక షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు విడుదల చేసి ఆదుకుంటాం. కొప్పాక షుగర్స్‌కు మళ్లీ గతవైభవం తెస్తాం’ అని అన్నారు. 

లోకేశ్‌ను కలిసిన ములకలపల్లి గ్రామ నిరుద్యోగ యువత
యలమంచిలి నియోజకవర్గం ములకలపల్లి గ్రామ నిరుద్యోగ యువత యువనేత లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వారి సమస్యలు పరిష్కరిస్తానని లోకేశ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ‘నిరుద్యోగ యువతను నిలువునా ముంచిన నయవంచకుడు జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ఇస్తామని దారుణంగా మోసం చేశాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. యువతకు ఉద్యోగాలు వచ్చేవరకు యువగళం నిధి కింద నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించి రాష్ట్రంలోని యువత పొరుగు రాష్ట్రాలకు వలసవెళ్లే పరిస్థితులను నివారిస్తాం’’ అని హామీ ఇచ్చారు. 

పోలీసులకు భవిష్యత్తుకు గ్యారంటీ కార్డులు పంచిన లోకేశ్
యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా యువనేత లోకేశ్ పోలీసులకు పలు హామీలు ఇస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ కార్డులు పంపిణీ చేశారు. కార్డుల్లో ప్రస్తావించిన అంశాలు.. ‘పోలీసు సోదరులకు జగన్ పాలనలో అన్యాయం జరిగింది. పోలీసులకు సరెండర్స్, టీఏ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. ఏకంగా పోలీసులకు ఇచ్చే అలవెన్స్ కూడా కోతపెట్టాడు జగన్. 15 శాతం అలవెన్స్ కట్ చేసాడు. ఎస్ఐకి 10 వేలు, హెడ్ కానిస్టేబుల్‌కు 8 వేలు, కానిస్టేబుల్‌కు 6 వేలు కట్ చేసాడు. జగన్ తెచ్చిన జిఓ 79 రద్దు చేస్తాం. అలవెన్స్ యథాతథంగా ఇస్తాం. టీడీపీ- జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జగన్ పాలనలో పోలీసులకు పెట్టిన బకాయిలు అన్నీ చెల్లిస్తామని హామీ ఇస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ కార్డులను యువనేత లోకేశ్ పోలీసులకు పంచారు.

*నారా లోకేశ్‌ను కలిసిన పురుషోత్తపురం రైతులు
యలమంచిలి నియోజకవర్గం పురుషోత్తమపురం రైతులు యువనేత లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.  ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి రాగానే వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ‘‘జగన్మోహన్ రెడ్డి అసమర్థపాలన కారణంగా రాష్ట్రంలో అన్నదాతలు ఆత్మహత్యల బాట పట్టారు. దేశం మొత్తమ్మీద రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 2వ స్థానం, కౌలురైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానం ఉంది. కాలువలు, చెరువుల్లో పూడిక తీయకపోవడం వల్ల నీరు పొలాల్లోకి వెళ్లి రైతులు నష్టపోతున్నారు. తాళ్లమ్మ చెరువుకు నీరు వచ్చే కాలువను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం. వ్యవసాయానికి నీరు అందిస్తాం. స్థానికంగా ఉన్న కంపెనీల్లో స్థానిక యువతకు ఉద్యోగాలిచ్చేలా చర్యలు తీసుకుంటాం. వ్యవసాయాన్ని ఉపాధిహామీ పథకంతో అనుసంధానించడానికి కృషిచేస్తాం’’ అని హామీ ఇచ్చారు. 

యువనేత లోకేశ్ యువగళం పాదయాత్ర వివరాలు

  • ఈరోజు నడిచిన దూరం 18.3 కి.మీ
  • ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం కి.మీ. 3059.6

222వరోజు (14-12-2023) యువగళం వివరాలు
యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం
ఉదయం
8.00 – కొత్తూరు ఎస్ వి కన్వెన్షన్ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.15 – లైన్ కొత్తూరులో స్థానికులతో సమావేశం.
8.45 – సోమన్నపాలెంలో స్థానికులతో మాటామంతీ.
9.15 – యర్రవరంలో యువతతో సమావేశం.
9.30 – యలమంచిలి వై.జంక్షన్ లో స్థానికులతో సమావేశం.
9.45 – యలమంచిలి కోర్టు రోడ్డులో స్థానికులతో సమావేశం.
10.00 – యలమంచిలి ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద స్థానికులతో సమావేశం.
10.10 – యలమంచిలి మున్సిపల్ ఆఫీసు వద్ద స్థానికులతో సమావేశం.
10.20 – యలమంచిలి మార్కెట్ జంక్షన్ వద్ద స్థానికులతో సమావేశం.
10.35 – యలమంచిలి రామాలయం వద్ద స్థానికులతో సమావేశం.
10.50 – యలమంచిలి రామాలయం వద్ద భోజన విరామం.
2.00 – యలమంచిలి రామాలయం వద్ద రిటైర్డ్ ప్రభుత్వోద్యోగులతో ముఖాముఖీ.
సాయంత్రం
4.00 – యలమంచిలి రామాలయం వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.30 – యలమంచిలి కొత్తపాలెం జంక్షన్ వద్ద స్థానికులతో సమావేశం.
5.00 – యలమంచిలి కట్లుపాలెం జంక్షన్ లో రైతులతో భేటీ.
5.15 – నారాయణపురంలో రైతులతో సమావేశం.
5.45 – మామిడివాడలో స్థానికులతో సమావేశం.
6.00 – కొత్తూరు జంక్షన్ లో స్థానికులతో సమావేశం.
6.15 – కొత్తూరు బ్రిడ్జి వద్ద స్థానికులతో సమావేశం.
7.15 – పంచదార్ల సెంటర్ లో స్థానికులతో సమావేశం.
7.45 – పంచదార్ల వద్ద విడిది కేంద్రంలో బస

More Telugu News