KCR: ఆసుపత్రిలో కేసీఆర్‌కి సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేసిన ఎంపీ సంతోష్ కుమార్

True leadership shines through even in challenging times
  • పుస్తకం చదువుతున్న ఫొటోను షేర్ చేసిన సంతోష్ కుమార్
  • 'నిజమైన నాయకత్వం ఇదే' అంటూ ట్వీట్
  • కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేసి, 'నిజమైన నాయకత్వం ఇదే' అంటూ బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆసుపత్రిలో బెడ్ పైన ఉన్న కేసీఆర్ ఓ బుక్ చదువుతున్న ఫొటోను ఆయన షేర్ చేశారు.

నిజమైన నాయకత్వం అంటే ఇదేనని, కష్టసమయంలోనూ అలాంటి నాయకత్వం బయటపడుతుందని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. జ్ఞాన సముపార్జనపై ఉన్న ఆసక్తితో ఆయన (కేసీఆర్) చదవడంలో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తమ ఆలోచనలు అన్నీ కేసీఆర్‌తో ఉన్నాయన్నారు. కాగా, కేసీఆర్ కొన్ని రోజుల క్రితం జారిపడటంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే.

KCR
santhosh kumar
BRS

More Telugu News