Team India: రింకూ, సూర్య అర్ధసెంచరీలు... టీమిండియా ఇన్నింగ్స్ ఆఖర్లో వర్షం

  • కెబెరాలో రెండో టీ20
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆతిథ్య దక్షిణాఫ్రికా
  • 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసిన టీమిండియా
  • వర్షం రావడంతో నిలిచిన మ్యాచ్
Rain stops Team India play

దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. మరో మూడు బంతులు విసిరితే ఇన్నింగ్స్ పూర్తవుతుందనగా వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. టీమిండియా ఇన్నింగ్స్ లో హార్డ్ హిట్టర్ రింకూ సింగ్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అర్ధసెంచరీలతో రాణించారు. ముఖ్యంగా, రింకూ సింగ్ తనదైన శైలిలో పవర్ హిట్టింగ్ చేశాడు. రింకూ 39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 68 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. 

అంతకుముందు, టీమిండియా 6 పరుగులకే ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్ మాన్ గిల్ వికెట్లు కోల్పోయింది. ఈ ఇద్దరూ డకౌట్ అయ్యారు. ఈ దశలో తిలక్ వర్మతో కలిసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. తిలక్ వర్మ 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 29 పరుగులు చేశాడు. 

అనంతరం సూర్య, రింకూ జోడి స్కోరుబోర్డును పరుగులు తీయించింది. సూర్య 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 56 పరుగులు చేశాడు. కాగా, ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా పేపర్ గెరాల్డ్ కోట్జీ... జడేజా (19), అర్షదీప్ (0)లను వరుస బంతుల్లో అవుట్ చేశాడు. కోట్జీ హ్యాట్రిక్ మీదుండగా... ఇంతలో వర్షం రావడంతో ఆటను నిలిపివేశారు. 

దక్షిణాఫ్రికా బౌలర్లలో కోట్జీ 3, మార్కో యన్సెన్ 1, లిజాద్ విలియమ్స్ 1, తబ్రైజ్ షంసీ 1, కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ 1 వికెట్ తీశారు.

More Telugu News