Congress: రాజాసింగ్, కడియం, పల్లా రాజేశ్వరరెడ్డి వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

  • బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కుట్ర పన్ని ఒకే రకమైన స్టేట్‌మెంట్ ఇచ్చారని ఆరోపణ
  • ప్రతిపక్షాలు తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నార్న కాంగ్రెస్ నేతలు
  • బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలను గమనిస్తున్నారని ఆగ్రహం
Congress complaint to DGP on Congress and BJP mlas

బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలపై తెలంగాణ డీజీపీ రవిగుప్తాకు కాంగ్రెస్ నేతలు నేడు ఫిర్యాదు చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శులు కైలాశ్ నేత, చారుకొండ వెంకటేశ్, మధుసూదన్ రెడ్డిలు డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదును అందించారు. ఇటీవల బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు... డీజీపీకి ఫిర్యాదు చేశారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఎమ్మెల్యేలు కుట్ర పన్ని ఒకే రకమైన స్టేట్‌మెంట్ ఇచ్చారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల ఎమ్మెల్యేలు రాష్ట్రంలో కుట్రలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని కులగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. డీజీపీ రవిగుప్తాకు వినతిపత్రం ఇచ్చామని, సమగ్రంగా అధ్యయనం చేయాలని కోరామన్నారు. ప్రజలందరూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీల ఎమ్మెల్యేల వ్యాఖ్యలను గమనిస్తున్నారన్నారు.

More Telugu News