Kalyan Ram: బ్రిటీష్ కాలం నాటి మర్డర్ మిస్టరీ... కల్యాణ్ రామ్ 'డెవిల్' ట్రైలర్ విడుదల

  • కల్యాణ్ రామ్ హీరోగా డెవిల్
  • బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కల్యాణ్ రామ్
  • అభిషేక్ నామా దర్శకత్వంలో చిత్రం
  • డిసెంబరు 29న చిత్రం విడుదల  
Kalyan Ram Devil trailer out now

బ్రిటీష్ కాలం నాటి కథాంశంతో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం డెవిల్. అభిషేక్ నామా ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నారు. ఇందులో మలయాళ భామ సంయుక్తా మీనన్ హీరోయిన్. 

తాజాగా ఈ చిత్రం నుంచి అధికారిక ట్రైలర్ రిలీజైంది. ఈ సినిమాలోని పోరాట దృశ్యాల గ్లింప్స్ గా ఈ ట్రైలర్ ను పేర్కొనవచ్చు. డెవిల్... పేరుకు తగ్గట్టే  కల్యాణ్ రామ్ ఈ చిత్రంలో భీకర పోరాటాలు చేశారని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది. "విశ్వాసంగా ఉండడానికి, విధేయతతో బతికేయడానికి కుక్క అనుకున్నావురా... లయన్" అంటూ కల్యాణ్ రామ్ పౌరుషంతో మీసం మెలేయడం ట్రైలర్ లో రోమాంఛకంగా అనిపిస్తుంది. 

ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ఇప్పటికే డెవిల్ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో, పాటకు విశేష స్పందన లభించింది. కాగా ఈ చిత్రం డిసెంబరు 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

More Telugu News