KCR: కేసీఆర్‌ను చూడకుండా కదిలేది లేదంటూ ఆసుపత్రి వద్ద కార్యకర్తల ఆందోళన... ఉద్రిక్తత

BRS followers dharna at Yashoda Hospital
  • కేసీఆర్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు
  • చాలాసేపుగా ఆందోళన కొనసాగిస్తున్న కార్యకర్తలు, మహిళలు
  • జై కేసీఆర్ అంటూ నినాదాలు
  • మహిళా పోలీసులు లేకపోవడంతో ఆపలేని పరిస్థితిలో పోలీసులు

హైదరాబాద్‍‌లోని యశోద ఆసుపత్రి వద్ద మంగళవారం సాయంత్రం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు ఆసుపత్రికి తరలి వచ్చారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. చాలాసేపుగా వారు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. లోపలికి వెళ్లనీయమని పోలీసులు చెప్పినప్పటికీ వారు వినడం లేదు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. తాము కేసీఆర్‌ను చూడకుండా కదిలేది లేదని చెబుతున్నారు. ఇందులో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. మహిళా పోలీసులు లేకపోవడంతో పోలీసులు వారిని ఆపలేని పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ విజ్ఞప్తి తర్వాత కూడా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది.
KCR
Telangana

More Telugu News