CBI: సీబీఐకి మరింత పవర్ కట్టబెట్టాలి: పార్లమెంటరీ ప్యానెల్

  • కేంద్రానికి నివేదిక సమర్పించిన ప్యానెల్
  • కేసుల దర్యాఫ్తులో రాష్ట్రాల అనుమతి క్లాజ్ ను తీసేయాలి
  • తొమ్మిది రాష్ట్రాలు అనుమతి ఉపసంహరించుకున్నాయని వెల్లడి
Parliamentary Pannel Important comments On CBI Powers

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కి మరింత పవర్ కట్టబెట్టాలని పార్లమెంటరీ ప్యానెల్ అభిప్రాయపడింది. రాష్ట్రాల అనుమతి తప్పనిసరి కావడంతో పలు కేసుల దర్యాఫ్తునకు ఆటంకం కలుగుతోందని, దర్యాఫ్తులో పారదర్శకత కూడా లోపిస్తోందని పేర్కొంది. అదేసమయంలో సీబీఐ అధికారుల దర్యాఫ్తు తీరుపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. అధికారుల తీరుతో కొన్ని రాష్ట్రాలు వివక్షకు గురవుతున్నాయని వివరించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ ప్యానెల్ తన నివేదిక సమర్పించింది.

కేసుల దర్యాఫ్తులో రాష్ట్రాల జోక్యాన్ని అడ్డుకోవడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ ప్యానెల్ సూచించింది. రాష్ట్రాల అనుమతితో సంబంధం లేకుండా ఏ కేసునైనా విచారించే అధికారం కల్పించాలని ప్యానెల్ సభ్యులు చెప్పారు. సీబీఐకి ఇప్పటికే అనుమతినిచ్చిన రాష్ట్రాలు కూడా తమ అనుమతిని ఉపసంహరించుకుంటున్నాయని గుర్తుచేశారు. తొమ్మిది రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని వివరించారు. దీంతో కొన్ని కీలక కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సీబీఐకి సహకారం అందడంలేదన్నారు. ఫలితంగా కేసుల దర్యాఫ్తు ముందుకు సాగడంలేదన్నారు.

More Telugu News