హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్ల బదిలీ.. కొత్త సీపీలు వీరే!
- హైదరాబాద్ కమిషనర్ గా కొత్తకొట శ్రీనివాస్ రెడ్డి
- సైబరాబాద్ కమిషనర్ గా అవినాశ్ మహంతి
- రాచకొండ సీపీగా సుధీర్ బాబు
మరోవైపు రాచకొండ సీపీగా ఉన్న చౌహాన్, సైబరాబాద్ సీపీగా ఉన్న స్టీఫెన్ రవీంద్రలను డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. వీరిద్దరికీ పోస్టులు కేటాయించకపోవడం గమనార్హం. హైదరాబాద్ సీపీగా ఉన్న సందీప్ శాండిల్యను నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ గా నియమించారు.