జూలోని పులి నోట్లో షూ.. పక్కనే సగం తినేసిన మనిషి మృతదేహం!
- పాకిస్థాన్‌లోని బహవల్పూర్ జూలో ఘటన
- ఆలస్యంగా వెలుగులోకి
- జూను మూసేసి దర్యాప్తు ప్రారంభించిన అధికారులు
అతడు ఎన్‌క్లోజర్‌లోకి దూకి పులికి ఆహారమై ఉంటాడని, మంగళవారం రాత్రే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పులి దాడిచేసినప్పుడు అతడు బతికే ఉండొచ్చని చెబుతున్నారు. బాధితుడిని గుర్తించాల్సి ఉంది. అతడు పులి నోటికి ఎలా చిక్కాడన్న దానిపై దర్యాప్తు జరుగుతోందని, ప్రస్తుతం జూను మూసివేశామని అధికారులు తెలిపారు.