Nara Lokesh: నారా లోకేశ్ యువగళం ముగింపు సభకు ముహూర్తం ఖరారు... చంద్రబాబు, పవన్ హాజరు

  • జనవరి 27 నుంచి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర
  • కుప్పంలో ప్రారంభం... విశాఖలో ముగింపు సభ
  • ఈ నెల 20న భారీ సభ
  • సభ విజయవంతం కోసం వివిధ కమిటీల ఏర్పాటు
Nara Lokesh Yuvagalam Padayatra closing meeting will be held on Dec 20

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర తుని నియోజకవర్గం తేటగుంట వద్ద చారిత్రాత్మక 3వేల కి.మీ. మైలురాయికి చేరుకుంది. 3వేల కి.మీలు అధిగమించిన చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా తునిలో యనమల గెస్ట్ హౌస్ వద్ద పైలాన్ ను లోకేశ్ ఆవిష్కరించారు. ఈ మ‌జిలీకి గుర్తుగా... వైసీపీ స‌ర్కారు మూసేసిన పేద‌ల ఆక‌లి తీర్చే అన్నక్యాంటీన్లు మ‌ళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇస్తూ శిలాఫ‌ల‌కం ఆవిష్క‌రించారు. 

ఈ కార్యక్రమానికి నారా బ్రాహ్మణి, దేవాన్ష్, నందమూరి మోక్షజ్ఞ, 'గీతం' భరత్, టీడీపీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, ఉభయగోదావరి జిల్లాల సమన్వయకర్త ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు హాజరయ్యారు.

ఉభయగోదావరి జిల్లాల్లో పూర్తయిన యువగళం

నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉభయగోదావరి జిల్లాల్లో పూర్తయింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 12 రోజులపాటు 178.5 కి.మీ.ల మేర పాదయాత్ర సాగింది. ఉభయగోదావరి జిల్లాల్లో 23 రోజులపాటు 404 కి.మీ.ల మేర యువగళం పాదయాత్ర సాగింది. 

పాయకరావుపేట శివార్లలో తాండవ బ్రిడ్జి వద్ద ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు లోకేశ్ కు అపూర్వ స్వాగతం పలికారు. లోకేశ్ కు స్వాగతం పలికేందుకు వచ్చిన నాయకులతో తాండవ బ్రిడ్జి పసుపుమయంగా మారింది. పాయకరావుపేట ఇన్ చార్జి వంగలపూడి అనిత నేతృత్వంలో లోకేశ్ కు అపూర్వ స్వాగతం లభించింది. 

తాండవ బ్రిడ్జిపై యువనేతకు ఉత్తరాంధ్ర నేతలు కింజరాపు అచ్చెన్నాయుడు, అశోక్ గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు, కళావెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, పీలా గోవింద సత్యనారాయణ, బండారు సత్యనారాయణమూర్తి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బెందాళం అశోక్, పాయకరావుపేట ఇన్ చార్జి వంగలపూడి అనిత, బుద్దా నాగజగదీష్, ద్వారపురెడ్డి జగదీశ్, బైరా దిలీప్, చింతకాయల విజయ్ తదితరులు అపూర్వ స్వాగతం పలికారు.

ఈ నెల 20న విశాఖలో యువగళం ముగింపు సభ

యువగళం పాదయాత్ర ముగింపు సభ ఈనెల 20వ తేదీన విశాఖపట్నంలో జరగనుంది. భోగాపురం ఎయిర్ పోర్టు సమీపాన గల పోలేపల్లిలో విజయోత్సవ సభ నిర్వహణ కోసం పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక కమిటీలను నియమించింది. నిర్వహణ కమిటీ బాధ్యులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి యువగళం విజయోత్సవసభను జయప్రదం చేయాల్సిందిగా పార్టీ నాయకత్వం విజ్ఞప్తి చేసింది. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. 

యువగళం ముగింపు సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున, సభ విజయవంతం చేయడానికి పార్టీ నాయకత్వం వివిధ కమిటీలను ఏర్పాటుచేసి బాధ్యతలు అప్పగించింది.

1. సలహా కమిటీ: 
సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు, కళావెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కావలి ప్రతిభా భారతి.
2. సమన్వయ కమిటీ : కింజరాపు అచ్చెన్నాయుడు, దామచర్ల సత్య, రవికుమార్, మంతెన సత్యనారాయణరాజు, రాంగోపాల్ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్.
3. మీడియా కమిటీ: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టి.డి జనార్దన్, బి.వి వెంకట్రాముడు.
4. సభా ప్రాంగణ కమిటీ: నిమ్మకాయల చినరాజప్ప, పల్లా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ, గణబాబు, భరత్, కూన రవికుమార్.
5. ఫుడ్ & వాటర్ కమిటీ: అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమ, పీలా గోవింద్, కెఎస్ఎన్ఎస్ రాజు, జ్యోతుల నెహ్రూ.
6. వసతి కమిటీ: గంటా శ్రీనివాసరావు, బుద్దా వెంకన్న, దీపక్ రెడ్డి, గండి బాబ్జి, వీరంకి గురుమూర్తి, వాసు.
7. పార్కింగ్ కమిటీ: రామరాజు (ఉండి ఎమ్మెల్యే), చింతమనేని ప్రభాకర్, వెలగపూడి రామకృష్ణ, నజీర్.
8. వేదిక నిర్వహణ కమిటీ: నిమ్మల రామానాయుడు, దీపక్ రెడ్డి, రవినాయుడు.
9. వాలంటీర్స్ కోఆర్డినేషన్ కమిటీ: గణబాబు, రాంగోపాల్ రెడ్డి, ప్రణవ్ గోపాల్, బ్రహ్మం చౌదరి.
10. రవాణా కమిటీ: ఆలపాటి రాజేంద్రప్రసాద్, పెందుర్తి వెంకటేష్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి.
11. ఆర్థిక వనరుల కమిటీ: అనగాని సత్య ప్రసాద్, ప్రత్తిపాటి పుల్లారావు, బి.సి జనార్దన్ రెడ్డి.
12. మెటీరియల్ కమిటీ: శ్రీకాంత్ (పార్టీ కార్యాలయం), మలిశెట్టి వెంకటేశ్వర్లు.
13. విశాఖ బ్రాండింగ్ కమిటీ: వెలగపూడి రామకృష్ణ, గణబాబు, గండి బాబ్జి.
14. మాస్టర్స్ ఆఫ్ సెర్మనీ: కింజరాపు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, ఎంఎస్ రాజు.

యువగళం పాదయాత్ర వివరాలు

ఈరోజు నడిచిన దూరం 16.8 కి.మీ.
ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 3023.7 కి.మీ.
220వరోజు (12-12-2023) యువగళం వివరాలు
పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం

ఉదయం


8.00 – నామవరం విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.10 – నామవరంలో స్థానికులతో సమావేశం.
8.25- దేవవరం గ్రామంలో బీసీలతో సమావేశం.
8.40 – వడ్డిమిట్టలో స్థానికులతో మాటామంతీ.
9.40 – గాడిచర్లలో మహిళలతో సమావేశం.
10.40 – ఉద్దండపురంలో స్థానికులతో సమావేశం.
11.25 – వేంపాడులో స్థానికులతో సమావేశం.
11.40 – చిన్నదొడ్డిగల్లులో భోజన విరామం.

మధ్యాహ్నం

2.00 – చిన్నదొడ్డిగల్లులో మహిళలతో ముఖాముఖి.

సాయంత్రం


4.00 – చినదొడ్డిగల్లు నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.15 – చినదొడ్డిగల్లులో కాపు సామాజికవర్గీయులతో భేటీ.
5.15 – కాగిత గ్రామస్తులతో మాటామంతీ.
5.30 – న్యాయంపూడిలో డ్వాక్రా మహిళలతో సమావేశం.
6.00 – వెదుళ్లపాలెంలో స్థానికులతో మాటామంతీ.
6.45 – గురుకులంలో కేబుల్ ఆపరేటర్లతో సమావేశం.
6.55 – నక్కపల్లి జంక్షన్ లో రేషన్ డీలర్లతో సమావేశం.

రాత్రి

7.05 – ఉపమాక అగ్రహారంలో స్థానికులతో సమావేశం.
7.50 – కృష్ణగోకులం ఉడా లేఅవుట్ విడిది కేంద్రంలో బస.
******

More Telugu News