Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం.. టీఎస్‌పీఎస్సీ పరీక్షల రీషెడ్యూల్

  • గత పరీక్షల్లో పేపర్ లీక్, పరీక్షల వాయిదాలతో విద్యార్థుల్లో గందరగోళం
  • ఈ నేపథ్యంలో నేడు సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి
  • కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్మెంట్ ఉండే అవకాశం
tspsc rescheduled all competitive exams telangana

టీఎస్‌పీఎస్సీ పరీక్షలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షలలో పేపర్ లీక్, పరీక్షల వాయిదాలు విద్యార్థులను గందరగోళానికి గురి చేశాయి. ఈ అంశానికి సంబంధించి తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 2 పరీక్షలు మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన, పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్మెంట్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పరీక్షల తేదీని మార్చి కొత్త పరీక్షల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

More Telugu News