smart phones: 20 వేల లోపు ఖరీదులో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవిగో..!

  • తక్కువ బడ్జెట్ లో మంచి కెమెరా క్వాలిటీ
  • ఫొటోలు, వీడియోలు తీయడానికి అనుకూలం
  • 5జి సపోర్ట్, బ్యాటరీ బ్యాకప్ తో అందుబాటులోకి..
These Are The Best Camera Phones Under 20000

నిత్యావసరంగా మారిపోయిన స్మార్ట్ ఫోన్ లో ప్రస్తుతం అత్యాధునిక ఫీచర్ల కోసం కొనుగోలుదారులు వెతుకుతున్నారు. తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్లు ఉన్న ఫోన్లకు మార్కెట్ లో డిమాండ్ పెరిగింది. సెల్ఫీలకు, రీల్స్ కోసం వీడియోలు చేయడానికి అనువైన స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవడానికి కస్టమర్లు పోటీ పడుతున్నారు. హై రిజల్యూషన్ ఫొటోలు తీసుకోవడానికి తక్కువ ఖర్చులో స్మార్ట్ ఫోన్ కొనాలని చూసే వారి కోసం ఈ కథనం.. కేవలం రూ.20 వేల లోపు బడ్జెట్ లో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫోన్ల వివరాలు ఇవే..

శామ్ సంగ్ గెలాక్సీ ఎం 34.. ధర రూ. 16,499
సూర్యకాంతిలోనూ బాగా కనిపించేలా ఫొటోలు తీసుకోవడానికి అనువుగా ఈ ఫోన్ ను తీర్చి దిద్దారు. ఇందులో ఫుల్ హెచ్ డీ, అమోల్డ్, 1000 నిట్స్ బ్రైట్ నెస్ తో 6.6 అంగుళాల డిస్ ప్లే ఉంది.
 ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ లో 120హెర్జ్ రిఫ్రెష్ రేట్, మీడియా టెక్ 2 గిగా హెర్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ ఉంటుంది. ఈ ఫోన్ 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 
ట్రిపుల్ కెమెరా సెటప్ లో 48 ఎంపీ మెయిన్ కెమెరా ప్లస్ 8 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 5ఎంపీ మాక్రో లెన్స్ కెమెరాలు ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ సామర్థ్యం కల బ్యాటరీ. అమెజాన్ వెబ్ సైట్లో రూ.16,499కి వస్తోంది. 

ఐకూ జెడ్7ఎస్.. ధర రూ.17,999
6.38 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే, 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 360హెర్జ్ శ్యాంప్లింగ్ రేట్ స్మూత్ నావిగేషన్.
డ్యూయెల్ కెమెరాలో భాగంగా 64ఎంపీ మెయిన్ కెమెరా, 2ఎంపీ బొకే కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 
కెమెరా ఫీచర్లు.. అల్ట్రా స్టెబిలైజేషన్ వీడియో రికార్డింగ్, మైక్రో మూవీ మోడ్, డ్యూయల్ వ్యూ వీడియో, నైట్ మోడ్, పోర్ట్ రైట్ మోడ్, డబుల్ ఎక్స్ పోజర్
ప్రాసెసర్.. స్నాప్ డ్రాగన్ 659.
8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమరీ.
4500 ఎంఏహెచ్ బ్యాటరీ.
ధర అమెజాన్ వెబ్ సైట్లో రూ.17,999

రెడ్ మీ నోట్ 12 ప్రో.. ధర రూ.18,690
డ్యూయల్ కెమెరా సెటప్ తో ఫోటోల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్మార్ట్ ఫోన్ ఇది.. 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపీ మాక్రో సెన్సార్,  16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది.
6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.
12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. 
5000 ఎంఏహెచ్ బ్యాటరీ. 
ధర అమెజాన్ వెబ్ సైట్లో రూ.18,690

మోటోరోలా జీ54.. ధర రూ.18,640 
క్వాడ్ పిక్సల్ టెక్నాలజీ తో కూడిన 50ఎంపీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫొటోగ్రఫీ ఫీచర్ల విషయానికి వస్తే.. అల్ట్రా రెస్, డ్యూయల్ క్యాప్చర్, స్పాట్ కలర్, నైట్ విజన్, మాక్రో విజన్, పోర్ట్ రైట్, లైవ్ ఫిల్టర్, పనోరమా, ఏఆర్ స్టిక్కర్స్, ప్రో మోడ్ , స్మార్ట్ కంపోజిషన్, ఆటో స్మైల్ క్యాప్చర్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 
6.55 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ పీఓఎల్ఈడీ డిస్ ప్లే, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.
7020 ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్.
12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్.
6000 ఎంఏహెచ్ బ్యాటరీ.
ధర అమెజాన్ లో రూ.18,640

ఒప్పో ఏ79.. ధర రూ. 19,999
ఈ స్మార్ట్ ఫోన్లో 6.72 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 90హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. 
మీడియా టెక్ 6020 ఎస్ఓసీ ప్రాసెసర్.
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్. 
5000 ఎంఏహెచ్ బ్యాటరీ. 
ధర అమెజాన్ వెబ్ సైట్లో రూ.19,999

More Telugu News