శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త.. దర్శన సమయం గంట పొడిగింపు
- భక్తులతో కిక్కిరిసిపోతున్న శబరిమల
- రెండోభాగంలో సాయంత్రం నాలుగు గంటల నుంచి దర్శనాలు
- ఇకపై మూడు గంటల నుంచే దర్శనాలు ప్రారంభం
సాధారణంగా రోజులో రెండోభాగంలో సాయంత్రం 4 గంటలకు దర్శనాలు ప్రారంభమై రాత్రి 11 గంటలకు ముగుస్తాయి. ఇప్పుడు దీనిని సాయంత్రం నాలుగు గంటలకు బదులు 3 గంటలకు తగ్గించారు. ఫలితంగా దర్శన సమయం గంట పెరిగింది. ఇక నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు రెండోదశ దర్శనాలు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయని బోర్డు స్పష్టం చేసింది.