Simran: మీరు లేకపోతే 25 ఏళ్ల నా సినీ ప్రయాణం సాధ్యమయ్యేది కాదు: సిమ్రాన్

Without him my 25 years cinema journey will not be possible says Simran
  • సిమ్రాన్ మేనేజర్ కామరాజన్ మృతి
  • 25 ఏళ్లుగా తన కుడి భుజంగా ఉన్నారన్న సిమ్రాన్
  • ఎప్పుడూ నవ్వుతూ, నమ్మకంగా ఉండేవారని ప్రశంస
ప్రముఖ సినీ నటి సిమ్రాన్ మేనేజర్ కామరాజన్ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న సిమ్రాన్... తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. కామరాజన్ మరణాన్ని నమ్మలేకపోతున్నానని... తనకు షాకింగ్ గా ఉందని చెప్పారు. తన ప్రియ మిత్రుడు కామరాజన్... గత 25 ఏళ్లుగా తనకు కుడి భుజంగా ఉంటూ, ఒక పిల్లర్ గా నిలిచారని, చాలా చురుకైన వ్యక్తి అని అన్నారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారని, నమ్మకంగా ఉండేవారని ప్రశంసించారు. ఆయన లేకుండా తన సినీ ప్రయాణాన్ని ఊహించుకోలేనని చెప్పారు. మీరు లేకపోతే 25 ఏళ్ల తన సినీ ప్రయాణం సాధ్యమయ్యేది కాదని చెప్పారు. మిమ్మల్ని ఎంతో మిస్ అవుతానని అన్నారు. కామరాజన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Simran
Tollywood
Kollywood
Manager

More Telugu News