Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కార్ల నెంబర్ ఇదే!

CM Revanth Reddy convoys car number is 0009
  • సీఎం కాన్వాయ్ కార్లకు 0009 నెంబర్ కేటాయించిన అధికారులు
  • శనివారం తొలిసారిగా కాన్వాయ్‌లో శాసనసభకు వెళ్లిన రేవంత్ రెడ్డి
  • తొలి రోజునే సీఎం రేవంత్‌ రెడ్డికి ట్రాఫిక్ ఇక్కట్లు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని కార్లకు అధికారులు 0009 నెంబర్‌ను కేటాయించారు. శనివారం మొదటిసారిగా ఆయన తన కాన్వాయ్‌లో శాసనసభ సమావేశానికి హాజరయ్యారు. కానీ, తొలి రోజునే ఆయనకు ట్రాఫిక్ చిక్కులు ఎదురయ్యాయి. సీఎం ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ సమస్యకు కారణాలు తెలుసుకుని బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రెడీ అవుతున్నట్టు సమాచారం.
Revanth Reddy
Congress

More Telugu News