assembly: నేడు 98 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణం... లాస్యనందిత, మైనంపల్లి సహా 14 మంది ఇంగ్లీష్‌లో ప్రమాణం

  • ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ
  • ప్రమాణం చేయని రాజాసింగ్ సహా బీజేపీ ఎమ్మెల్యేలు
  • కాంగ్రెస్ నుంచి అరవై మంది బీఆర్ఎస్ నుంచి ముప్పై రెండు మంది ప్రమాణం
14 leaders take oath in English

తెలంగాణ అసెంబ్లీలో మొదటి రోజు 119 మంది ఎమ్మెల్యేలకు గాను 98 మంది ప్రమాణం చేశారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి 60 మంది, బీఆర్ఎస్ నుంచి 32 మంది, మజ్లిస్ నుంచి ఆరుగురు, సీపీఐ నుంచి ఒకరు ప్రమాణం చేశారు. ఇందులో 14 మంది ఆంగ్లంలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. 

బీజేపీ నుంచి గెలిచిన ఎనిమిది మంది తొలి రోజు ప్రమాణం చేయలేదు. అక్బరుద్దీన్ ఒవైసీకి ప్రొటెం స్పీకర్ గా బాధ్యతలు అప్పగించడంతో తాము ప్రమాణం చేసేది లేదని రాజాసింగ్ నిన్న ప్రకటించారు.

ఇక ఇంగ్లీష్ లో ప్రమాణం చేసిన వారిలో లాస్య నందిత, ప‌ద్మావ‌తి, బండారి ల‌క్ష్మారెడ్డి, గ‌డ్డం వినోద్, మ‌ధుసూద‌న్ రెడ్డి, కేపీ వివేకానంద, కాలేరు వెంక‌టేశ్, ప్రేమ్ సాగ‌ర్ రావు, ల‌క్ష్మీకాంతారావు, మ‌ద‌న్ మోహ‌న్ రావు, ముఠా గోపాల్, మైనంప‌ల్లి రోహిత్, తెల్లం వెంక‌ట్రావ్, జి.వివేక్ ఉన్నారు. 

మజ్లిస్ నుంచి గెలుపొందిన అహ్మ‌ద్ బిన్ అబ్దుల్లా బ‌లాల‌, జాఫ‌ర్ హుస్సేన్, కౌస‌ర్ మొయినుద్దీన్, జుల్ఫీక‌ర్ అలీ, మ‌హ్మ‌ద్ మాజీద్ హుస్సేన్, మ‌హ్మ‌ద్ మోబిన్ ఉర్దూలో ప్ర‌మాణం చేశారు.

More Telugu News