KCR: కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్‌కు రామోజీరావు లేఖ

Ramoji Rao letter to KTR on KCR health issue
  • కేసీఆర్ త్వరగా కోలుకొని, రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలన్న రామోజీ రావు
  • హిప్ రీప్లేస్‌మెంట్ తర్వాత వాకర్ సాయంతో నడుస్తోన్న కేసీఆర్
  • కేసీఆర్ మానసికంగా కూడా దృఢంగా ఉన్నారన్న యశోద డాక్టర్లు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఆకాంక్షించారు. ఈ మేరకు కేసీఆర్ తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆయన లేఖ రాశారు. కేసీఆర్ త్వరగా కోలుకొని రెట్టించిన ఉత్సాహంతో ప్రజాసేవకు పునరంకితం కావాలన్నారు. 

మరోవైపు కేసీఆర్‌కు హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ విజయవంతమైందని, ఆయన కోలుకుంటున్నారని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వాకర్ సాయంతో కేసీఆర్ నడుస్తున్నట్లు తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేసే అవకాశముందన్నారు. కేసీఆర్ కు ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమన్నారు. కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితి మెరుగుప‌డుతుంద‌ని, త్వ‌రిత‌గ‌తిన కోలుకోవ‌డానికి అనుకూలంగా కేసీఆర్ శ‌రీరం సహకరిస్తున్నట్లు తెలిపారు. మాన‌సికంగానూ కేసీఆర్ దృఢంగా ఉన్నార‌ని డాక్టర్లు వెల్లడించారు.
KCR
Telangana
BRS

More Telugu News