chandrababu: గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్లు ఇస్తా: చంద్రబాబు

I will give tickets only to winning candidates says Chandrababu
  • సర్వేల్లో రిపోర్ట్ సరిగా రాకపోతే ఉపేక్షించనన్న చంద్రబాబు
  • పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టలేనని స్పష్టీకరణ
  • టీడీపీ, జనసేన నేతలు కలిసి పనిచేయాలని సూచన
గెలిచే సత్తా ఉన్న నాయకులకే టికెట్లు ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ అంతర్గత సర్వేల్లో పనితీరు బాగోలేదని రిపోర్ట్ వస్తే ఉపేక్షించే పరిస్థితే లేదని అన్నారు. పనితీరు బాగోలేని వారిని ఉపేక్షించే పరిస్థితే లేదని... వారి స్థానంలో సత్తా ఉన్న మరో నాయకుడిని పెడతానని చెప్పారు. పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టబోనని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ఓట్ల అవకతవకలను పార్టీ ఇన్ఛార్జీలు బాధ్యతగా తీసుకోవాలని... అన్నీ పార్టీ అధిష్ఠానమే చూసుకుంటుందనే అలసత్వం వద్దని అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు కొట్టుకుపోయిందని చంద్రబాబు విమర్శించారు. ప్రతి కార్యక్రమంలో టీడీపీ, జనసేన నేతలు కలిసి పని చేయాలని సూచించారు. ఇరు పార్టీల శ్రేణులు క్షేత్ర స్థాయి వరకు కలిసి పని చేయాలని చెప్పారు. ప్రజా సమస్యలపై గ్రామ స్థాయిలో కూడా కలిసి పోరాడాలని అన్నారు.
chandrababu
Telugudesam
Janasena

More Telugu News